ఓ మధుర జ్ఞాపకం..
ఆ చిన్న పడవలో గోదారమ్మ గుండెలపై తేలుతూ వెళుతుండగా... నువ్వు నా గుండెలపై తలవాల్చి చేసిన బాసలు గుర్తున్నాయా?. మన ప్రేమ ఎప్పటికీ ఇలానే వుండిపోవాలని.. నీలో నేను ఒదిగిపోవాలని.. చెప్పుకున్న మాటలు నీకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తున్నాయి కదూ! ఆ కోకిలమ్మతో పాటు గొంతుకట్టి మనిద్దరం పాడుకున్న పాటలు నీ మనసులో వినపడుతున్నాయా? ఏది నీ గుండెలపై చెవిఆన్చి నన్ను కూడా విననివ్వు మరి!.
తెలతెలవారినా.. మంచు పరదా కప్పుకుని... మునగలాక్కుని పడుకున్న ఈ గోదావరి.., చలిపొద్దుకు లేవకుండా.. ఒళ్ళువిరుకుంటూ బద్దకం తీర్చుకుంటున్నట్టుగావుండే ఈ గోదావరి..., ఆహా!.. ఎంతఅందమో కదా!. పొద్దున్నే నేనులేవగానే నా కళ్ళెదుటకొచ్చి.... లేవండి బారెడు పొద్దెక్కింది.. అని చిన్న చిరునవ్వుతో నన్ను పలకరిస్తావే.. దానికన్నా అందమా ఇదీ!, అలా అంటే చిరునవ్వునవ్వేస్తావుగానీ.. ఈ కోనసీమ అందాలన్నీ నింపుకున్న నీ వన్నెలతో పోల్చుకుంటే.. ఈ అందాలేపాటివిలే!. అమ్మో.. అలా సిగ్గుతో ముడుచుకుపోకూ.. మెళికలు తిరిపోకే.. ఆ తెరచాపలా గాలిలో తేలిపోకే..., ఇదంతా నా పైత్యం అని తీసిపారేయకు మరి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా!. నిజమే.. ఇవి పొగడ్తలు కాదురా బంగారం. స్వచ్ఛమైన నిజాలురా.
అదినేను మొదటిసారి గోదావరి మీద అలలతో పాటుతేలటం... లాంచిలో ప్రయాణం..., నాకు కొత్తా.., రివ్వుమంటూ వీస్తున్న గాలి కొంటెగా కవ్విస్తున్నట్టు అనిపించింది. అందుకేనేమో భయమేవేయలేదు.. చాలా సరదాగావుంది.., మా దూరపుచుట్టం పెళ్ళికని వచ్చాం.. నేను పెళ్ళికొడుకు తరపు. చుట్టూ కొబ్బరిచెట్లతో ముసుగేసేసిన పేద్ధ.. పెంకుటి లోగిలి..అందులోనే మాకు విడిది. పెళ్ళిహడావుడి చూస్తూ.. మేమంతా ఆ ఇంటిచుట్టూ కలతిరుగుతుంటే పక్కింట్లో మల్లెపూలు కోస్తూ నువ్వు కనిపించావు.. నావైపు చూస్తావేమోనని ఎంత సేపు వేచిచూసినా నీ పనినీదేగానీ పట్టించుకోవే. ఎవరన్నా చూస్తే బాగోదేమోనని నేను వెళ్ళిపోయాను. తరువాత పందిట్లో పన్నీరు చల్లటానికి నువ్చొచ్చినప్పుడు నీవొంక కాస్త కొంటెగా చూసి..,ఇందాక అంతలా చూస్తుంటే నన్ను పట్టించుకోలేదే అన్నట్టు చూసాను గుర్తుందా.., తరువాత అదే పెళ్ళిలో ఆ కొబ్బరాకు పందిర్లలో మనం చూపులతో దోబూచులాడుకున్నాం గుర్తుందా.., నీకు గుర్తున్నాయో లేదోగానీ.. నువ్వుకోస్తున్న ఆ మల్లెపూల సుగంధం.. నువ్వు చల్లిన ఆ పన్నీటి సుగంధం నాకింకా గుర్తున్నాయి.. నాకివన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయెందుకో.
అది జరిగి సంవత్సరం తిరక్కుండానే అలాంటి పందిరిలోనే మనిద్దరికీ పెళ్ళయ్యింది కదా!... అప్పుడేమనిపించింది నీకు?, నాకైతే.. నిన్ను పెళ్ళిలో కలిసిన ఆరోజే.. ఆ దేవుడు మనిద్దరికీ ముడివేసేసాడని అనిపించింది. మనం పొలం గట్లలో... గోదారొడ్డున.. చింతతోపుకాడా.. దొంగచాటుగా కలుస్తుండటం చూసి జాలేసిందో ఏమో పాపం.. గోదారి ఇసకల్లో మనం సరదాగా కట్టుకున్న బొమ్మరిల్లులాంటి ఇంటిలో మనిద్దరినీ గెంటి.., ఇలా అచ్చంగా వెయ్యేళ్ళు... ఒకరి గుండెగూటిలోగిళ్ళలో ఒకరు సవ్వడులుచేసుకోండని.. ఇద్దరికీ బ్రహ్మముడివేసాడనిపిస్తుంటుంది నాకు.
కానీ ఆరోజులు ఇంకా నాకు గుర్తున్నాయి... వెచ్చంగా నీ ఒళ్ళో తలపెట్టుకుని.. ఊరిచివర తమలపాకుతోటల్లో.. ఘాటుఘాటుగా.., చల్లంగా ఎన్నెల్లో.. అరటిచెట్టు నీడల్లో కూర్చుని.. మాటుమాటుగా.. మనం పెట్టుకున్న ముద్దులు..!!, ముద్దులతో వేసుకున్న ముద్దర్లు..., అవి చూసి సిగ్గుతో తలవొంచుకుని నవ్వుకున్న బంతిపూలు..., ఆగుట్టంతా గుండెల్లో దాచుకుని నిద్రలేని రాత్రులు. నాకింకా గుర్తున్నాయి.
నాకివన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయెందుకో.
పెళ్ళయిన కొత్తలో ఒకసారీ.... నీ పుట్టినరోజుకనీ.. ఒకసారి మీ ఊరెళ్ళాం గుర్తుందా!, అప్పుడు మళ్ళీ మనం తిరిగిన చోట్లన్నీ దొంగచాటుగా తిరిగేవాళ్ళం... చెఱుకుతోటల్లో పరుగుపందేలేసుకునేవాళ్ళం. పిల్లకాలవ పక్కన జామచెట్టుకు పట్టిన పట్టుతేనే తీసి నీకు పుట్టినరోజుకానుకగా ఇచ్చాను.. నువ్వు ఆ తేనె రుచిచూసి ఆనందంతో పొంగిపోయావు.. మీ మనసంత తీయగావుంది అని బిగికౌగిలికానుక తిరిగిచ్చావు గుర్తుందా. అలా పొలాంలెంబడీ.. పుట్టలెంబడీ తిరిగి తిరిగి అలసిపోయి సందెపొద్దేల కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చి.. మీ ఇంటి పెరట్లోవున్న గున్నమావిచెట్టుకింద చాపలేసుకుని కుర్చుని కబుర్లుచెప్పకునేవారం గుర్తుందా. అలా కబుర్లలో పడి ఈ లోకాన్నే మర్చిపోయేవాళ్ళం.. తలుచుకున్నా చాలు.. అబ్బా!!.. ఆ రోజులు ఎంత బాగుంటాయో.
-------------------------
ఇది నేను రాసుకున్న ఒక పాటకు బ్లాగ్ రూపం :-)