బకాసురులు - 2
(ఇది ఇంటర్వెల్ తరువాత భాగం.. ముందు భాగం చదివి సమోసాలు తిన్నాకా ఇది చదవండి.. )
పెళ్ళాన్ని ఊరి బస్సెక్కించి.. పక్కనేవున్న బీరుషాపులో.. ఒక చిన్నలారీడు బీరుకాయలు కొని.. మనుషుల్నిపెట్టి ఇంటికి పంపించమని ఎడ్రసు రాసి షాపువాడికిచ్చాడు చందు. వచ్చిన మనుషులు.. పేకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళలాగా.. ఫ్రిజ్ నిండా.. బీరువానిండా.. మంచంనిండా.. సోఫానిండా.. సింక్ నిండా.. లెట్రిన్ సీట్ నిండా... ఎక్కడ పెట్టమంటే అక్కడ బీరుకాయలు సర్దేసి.. నెలరోజులకు సరిపడా స్టాక్ పెట్టి.. నడవడానికి చోటులేకుండా ఇంటినిండా నింపేసి వెళ్ళిపోయారు. "ఎక్సూజ్ మి..", అని అలవాట్లోపొరపాటుగా అడ్డంగా పడివున్న బాటిల్సుతో అంటూ.. తప్పించుకుంటూ.. తనటీమ్లోనేవున్న నలుగురు కుర్రాళ్ళకు ఫోను చేసి ( ఆ నలుగురు కుర్రోళ్ళకి.. మళ్ళీ రీ ఇంట్రో. కావాలంటే.. ముందు చెప్పిన రాయలసీమ ఎపిసోడ్.. డి.వి.డిని ఇక్కడ ప్లేచేసుకున్నట్టు ఊహించుకోండి..) , "సాయంత్రం పార్టీకి మీరు తప్పకుండా రావాలి.. కొత్త అని అసలేమీ సిగ్గుపడొద్దు.. ఇది అందరం కలవాలనే గెట్ టూగెదర్..", అని మరీ మరీ రమ్మని పిలిచాడు.
చీకటిపడటంతో ఇంటి వాతావరణం మారిపోయింది. బొండుభద్రం.. నల్లశీను.. కుక్కల సతీష్.. చుండ్రురమణ..ఇంకా మరో ఇద్దరితో.. ఇల్లు బార్ లాగా కలకలలాడిపోయింది కాదు కాదు.. కలకలలాడే బార్ లాగా అయిపోయింది.. అబ్బాఇదీ కాదు.. ఇల్లులో కలకలలు బార్ లాగా అయిపోయాయి.. (ష్.ష్.. మీకు అర్ధమయ్యిందనే అనుకుంటున్నా!!.., అదే సినిమా అయితేనా ఈ సీనుకు.. గుణశేఖర్ లా నాలుగుకోట్లుపెట్టి పెద్దసెట్ వేయించి చూపించేవాడిని.., అఫ్ కోర్స్.. నిర్మాత వెఱ్ఱిబుజ్జి అయితే)
దొరికిందే పట్టు అని.. పట్టుకు పది బాటిల్ల చొప్పున తాగటం మొదలెట్టారు నలుగురు కుర్రాళ్ళూ.. ఒక్కరోజులోనే మొత్తం లోడు లోడంతా ఖాలీచేసేసి.. తినటానికి తెచ్చుకున్న స్టఫ్ అయిపోవటంతో.. చందూ ఇంట్లో నెలకు సరిపడా తెచ్చిపెట్టుకున్న ఉప్పూ.. కందిపప్పూ.. చింతపండూ.. ఆవాలు.. మెంతులు.. గసగసాలు లాంటి పచారీ సరుకులన్నీ.. ఇది బాగుందంటే.. టేస్టు ఇది బాగుందని.. ఎలకలు కొట్టినట్టు డబ్బాలన్నిటికీ పళ్ళతోటి గాట్లుపెట్టేసి.. తిరగబోసేసి తినేసారు.
ఇదంతా చూసిన పక్కింటివాళ్ళు... ఎడ్వటైజ్మెంటుల్లేని సీరియల్లాగా సీనుకు సీను డడండ్.. డడండ్.. అని మ్యూజిక్కుతో.. ఫ్లాష్ ప్లాష్.. ఎడిటింగ్ ఎఫెక్టులతో.., 3డి సినిమా కళ్ళజోడులాగా కళ్ళకుకట్టినట్టు.. చందూవాళ్ళావిడకి ఫోనులోనే బుల్లితెరపై చూపించేసారు. అవతలవైపు ఫోనులోమాట్లాడుతున్న చందువాళ్ళావిడ మొహం.. బ్లాక్ &వైట్లోకి మారిపోయింది. అదే బ్లాక్ & వైట్ మొహమేసుకుని.. తరువాత రోజునే ఊరునుండి తిరిగొచ్చేసినావిడ. లిప్ట్ ఎక్కకుండా..., మెట్లెక్కి రాకుండా.., మేడమీదకొచ్చేసింది.
(ఇదే సీరియల్ అయితే.. ఇక్కడే మిగతాది వచ్చేవారం అని టైటిల్స్ వేసేస్తూ.. టైటిల్ సాంగ్ వేసేద్దుం). ఇంతకూ ఆమె లిప్ప్టు ఎక్కుండా.. మెట్లమీదనుండి రాకుండా ఎలా వచ్చిందబ్బా అనుకుంటున్నారా!!, తాగిపడేసిన బీరుబాటిల్లపై అడుగులో అడుగులేసుకుంటూ స్లోమోషన్లో.. నడుచుకుంటూ (ఇదే మోషన్.. నాలుగు ఎపిసోడ్స్ చూపించొచ్చు), నాలుగో ఫ్లోర్లోవున్న వాళ్ళ అపార్ట్మెంటులోకొచ్చేసరికి..., స్వైన్ ఫ్లూ వచ్చిన పందులకి.. టామీ ఫ్లూ టాబ్లెట్టు ఇస్తే మత్తుగా పడిదొర్లుతున్నట్టుగా దొర్లుతున్న చందు.. అండ్ నాదస్వర బృందాన్ని చూసి "హె.. కృష్ణా.. ముకుందా.", అన్నపాట అర్తిగా బ్యాక్ గ్రౌండలో వింటూ.. జన్మధన్యమైపోయిన ఆవిడకి కళ్ళుతిరిగిపోయి.. పోకిరి సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టు దిమ్మతిరిగి మైండ్ బ్లాకయిపోయింది.
తలనుండి రాలిన చుండ్రులో కప్పుకుపోయిన్న చండ్రురమణ మొహాం కనపడటంలేదు. పీతకి తాతలాగా తాగిన బొండుభద్రం.. ఒక రూములో మొత్తం బెడ్ కిందనుండి.. కుర్చీలకిందనుండి.. గోడలదగ్గరనుండి.. కార్పట్ పైనుండి.. కార్పెట్ ఏరియా అంతా కవర్ చేసేసి గదికి సరిపడా పడుకున్నాడు. కుక్కలు చించిన కర్టెన్లాగా చిందరవందరగా పడివున్నాడు కుక్కలసతీష్. అసలు కేండెట్టు నల్లశీనేలావున్నాడనే కదామీ కంగారు.., టెన్సన్ పడకండి.. గోర్లుకొరుక్కోకండి.. మిగిలిన ఇద్దరికిందా నలిగిపోయి నల్లపూసైపోయాడుగానీ.. బాగానేవున్నాడు.
ఆ దెబ్బతో కంపెనీలో అందరికీ ఆ నలుగురి గురించీ తెలిసిపోయింది.. పార్టీ ఏదన్నావుంటే... ఎన్నికలముందు దొంగచాటుగా.. మీడియాకి దూరంగా పారిపోయి.. పొత్తులు (మొక్కజొన్న పొత్తులు కాదు) కలుపుకుంటున్న రాజకీయనాయకుల్లాగా.. వాళ్ళకు తెలియకుండా పార్టీలు జరుపుకుంటున్నారే తప్ప.. ఒక్కడుకూడా వీళ్ళముందు పార్టీమాటెత్తటంలేదు.. తినేసి వచ్చి.. వాళ్ళముందు.. బ్రేవ్.. మని గౌడుగేదే త్రేన్చినట్టు పొరపాటున త్రేన్చినా.. గ్యాస్ట్రిక్ ప్రోబ్లమ్ వచ్చేసింది అంటున్నారేగానీ అసలు విషయమే పెద్ద గోబర్ గ్యాస్ అని చెప్పటంలేదు.
లంచ్.. డిన్నర్ ఫ్రీగా ఇచ్చే కంపెనీవాళ్ళు.., అన్నీ మానేసారు. ఆఫీసు ఎంప్లాయిస్ వాహనాలకన్నా.. కేంటిన్ వాడు వండిన వస్తువులు పట్టుకొచ్చే వాహనాలు ఎక్కువైపోయాయని జనాలు గొడవపెడుతున్నారని.. చిన్న సాకును సాగదీసి.. వంగదీసి.. లొంగదీసుకుని.. కార్పొరేట్ స్టైల్లో చెప్పి.. అసలు ఇలా ఇండియా టైము.. యు.యస్ టైము రెండూ చూసుకుని.. ఆప్పొద్దులా ఆంబోతులా తింటున్న("ముప్పొద్దులా దున్నపోతు" కి కొత్త ప్రయోగం.., "ఆరుపొద్దులా ఆంబోతులా" అని అర్ధం),
"ఆం-బోతులు" ఎవరని.. బండబూతులు తిట్టి.. లేనినీతులు చెప్పి.. కొంగబాతుల చంపుట.. నేరమెగదరా సుమతీ.. అని చక్కగా నవ్వుతూ అర్ధంకాకుండా చెప్పిన హెచ్చార్ టీమ్... శ్రీకృష్ణకమిటీలాంటి.. శ్రీరామకమిటీ.. శ్రీదుర్యోధనకమిటీ.. శ్రీబకాసురకమిటీ (టైటిల్ కి జస్టిఫికేషన్ కాదు.).. లాంటి తొమ్మిది కమిటీలు వేసి..ఇకనుండి. తొమ్మిదిదాటాకావుండేవాళ్ళకే డిన్నర్ ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పారు.
అయినా.. ఆ నలుగురి ప్రస్థానం ఆగలేదు.. పనున్నాలేకపోయినా.. పన్నున్నా లేకపోయినా.. అన్ లిమిటెడ్ భోజనంకోసం లేనిపనిని.. అన్ లిమిటెడ్ గా కల్పించుకుని చేస్తూ తినేస్తున్నారు.
కాలంగడిచింది.. కంపెనీ కేంటిన్ మూతపడింది... అన్ లిమిటెడ్ కి అలవాటు పడ్డ ఆ నాలుగు నాలుకలూ చప్పబడి.. చప్పలించబడి.. మెత్తబడి.. ఒత్తబడి.. చిత్తుచిత్తుచేయబడి.. చేతబడిచేసిన నక్కలవలె.. బక్కచిక్కిపోయినవి.
వరదల్లో కట్టుకున్న గోచీవూడిపోబోతూ.. నీటిలోప్రయాణానికి టిక్కెట్టుతీసుకున్న.. సరిసమయంలో.. హెలీకాప్టర్లోంచి పులిహోర పొట్లం పైనుండి కిందకిందకు జారి. మీదమీదకి చేరి.. చేతిదాకావస్తుంటే.. "ఒకటోసారి.. అన్నమా.. మానమా..?, రెండోసారి.. అన్నమా.. మానమా..?", అనుకుంటూ చీటీపాటలా పాటపాడుకుంటున్న ఒక పేద జీవికి.. ఫైటింగ్ సీన్లో గాల్లోగిరగిరగిరమంటూ.. తిరుగుతూవచ్చే మన తెలుగుహీరోలాగా.. ఒక ఎండుటాకు.. గోచీప్లేస్ ని రీప్లేస్ చేస్తే.. "అన్నమే..", అని చిరునవ్వునవ్వుకుని అంటిపెట్టుకున్న ఆకును ఎగరనీయకుండా పులిహోరప్యాకెట్టుని ఎగిరి పట్టుకుని.. బాలీవుడ్ కింగ్ కిస్సర్ ఇమ్రాన్ హస్మీలాగా ఆ పేకెట్టుకు లిప్ కిస్ ఇచ్చి.. పులిహోర తిన్నంత హాయిగా.. తియ్యటి వార్త మోసుకొచ్చింది ఒక ఈ-మెయిల్.
ఆ వారం కంపెనీ మూడవ పుట్టినరోజుని.. సరిగ్గా ఈరోజుకు మూడురోజుల తరువాత.. సెలబ్రేట్ చేసుకోవటానికి మీరంతా మాంచి మూడ్‌లో.. మూడోనెంబరు రోడ్లోవున్న "మిడ్ టవున్ మూడ్స్" రెస్టారెంటు మూడోప్లోర్కి రావాలని సరిగ్గా మధ్యాన్నం మూడింటికి.. ఇన్ బాక్సులోనవ్వింది ఆరోజొచ్చిన ముప్పైమూడోమెయిల్.. (మూడంకెని ఎక్కువ వాడానని..దీనికి తరువాత స్టోరిలో ఎక్కడో గొప్ప ఇంపార్టెన్సు వుంటుదని.. ఇంగ్లీష్ ఫిక్షన్ సినిమా ప్రేక్షకుడిలాగా ఎక్కువాలోచించి బర్గర్.. సేండ్విచ్ మీద కాలేసేయకండే..)
ఆ మెయిల్ చూసి.. చేతబడిచేయబడిన నక్కలవలెనున్న నలుగురి నాలుకలూ.. సత్తువను పొంది.. సుఖముగానుండెను. (కధసుఖాంతానికి వాడేపదం కాదు)
కాలం గడిచింది.... (నో కామెంట్స్.. ఈ కధలో ఇదే నా ఊతపదం).
కాస్త వెరైటీగా.. పార్టీకి ముందురోజు రానేవచ్చింది.. వెరైటీగా.. ముందురోజు రావటం కాదు.. కధల్లో ఎప్పుడులాగా.. పార్టీరోజు రావటం కాకుండా.. పార్టీముందురోజు వెరైటీగావచ్చిందని.
"రేపటి పార్టీకి ఎలారా.. అసలు ప్రిపేర్ కాలేదు.. కడుపంతా నిండిపోయింది.., అసలు తినలేమేమోరా..", అన్నాడు కుక్కలసతీష్.
"అవున్రా.. నాదీ అంతే.., మరీ ఇంత మూడురోజులముందు సడెన్ గా చెబుతారేంట్రా మనోళ్ళు, కనీసం ఒక పదిరోజులైనా ముందు చెబితే.. పార్టీకి.. సామాజిక న్యాయం చేద్దుం కదా!!", అన్నాడు బొండుభద్రం.
"ఏదొకటి రా బాబూ.., పొద్దున్నే టీ.వీలో మంతెన సత్యన్నారాయణరాజు ఫ్రీగా సలహాలు చెబుతున్నారుకదా అని టీ.వీ పెడితే...,రోజంతా నిమ్మరసం తేనె.. నిమ్మరసం తేనే మాత్రమే పుచ్చుకుంటే.. దానివల్ల కడుపుఅంతా డెట్టాల్ వేసి క్లీన్ చేసినంతలా అయిపోతుందని చెప్పారు.., మొత్తం క్లీన్ అవ్వాలని.. ఒక నాలుగు బాటిల్లు కానిచ్చేసా.. కానీ ఈ తేనే నిమ్మరసం మాత్రమే వుంది చూసారూ.. మొత్తం మంట మంట.. భగభగలాడే పెట్రోల్‌లాగా బయటకొస్తుంది..., ఇదేంటి మాస్టారు.. డెట్టాల్ లా క్లీనింగ్ అంటే మంట కూడా అలాగేవుంటుందా.. అని ఆయన్నే అడుగదామంటే మళ్ళీ రేపొద్దుటదాకా టీ.వీలో రాడే..", అన్నాడు నల్లశీను.
"ఒరే.. శుభమా అని భోజనాలుపెడుతుంటే.., గురువుగారు.. కడుపులో దేవుతుంది.. వాంతిచేసుకోవాలి.. కొత్త ఆకు ఒకటి తెచ్చివేస్తారా, అన్నాడంట వెనకటికెవడో.., అంత తేడాగా వున్నవాడు అక్కడికి రావటమెందుకూ.. వచ్చివడ్డించే వాడిని పిలిచి మరీ ఆకువేయించుకుని.. ఫుల్ గా కక్కటమెందుకూ.., ఛస్.. ఆపండెహే!!, కడుపు నిండుగా వున్నవాళ్ళూ... మంటతో బాధపడేవాళ్ళూ రానక్కర్లేదు... మీ కడుపులు క్లీన్ చేయించుకోవాలంటే నాదగ్గర ఒక ఐడియావుంది.. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది..", అని చిరాకుపడుతూనే సలహాచెప్పాడు చుండ్రురమణ.
ఏంట్రాఏంటది.. అని ముగ్గురూ.. చుండ్రురమణ చుట్టూచేరి గుసగుసలాడటం మొదలుపెట్టేరు.
"పాయిజన్ తాగామని చెప్పి ఏ కార్పొరేట్ హాస్పటల్ కి అయినా వెళ్ళామంటే.., ఏ టెస్టూ చేయకుండానే.., కడుపులో పేగులుమెత్తం బయటకు తీసేసి.. పక్కనున్న బేసిన్లోవేసి సుబ్బరంగా కడిగేసి.., ఆఁ.. అనమని.. నోరుతెరిచాకా.. ఆ పేగులు మొత్తం నోట్లోకి తోసేసి.., అరగంటలో సర్దేస్తారు.. అంతే కడుపు మొత్తం క్లీన్..", అన్నాడు చుండ్రురమణ.
"సర్దేసిన తరువాత.. ఫీజు చెబితే.. అన్నీ మళ్ళీ బయటకొస్తాయి..", అని కోపంగా అన్నాడు బొండు భద్రం.
ఎవరుమీరు.. అసలెందుకొచ్చారిక్కడికి.. అని చెమటలు తుడుచుకంటూ అడిగిన ఒక బక్కప్రాణికి.. జేబులోంచి.. ఒక సిగరెట్టు పెట్టెనుండి.. ఒకపక్కనుండి చింపిన.. అట్టముక్కలాంటి కార్టుముక్కొకటి చూపించి.. "వు. ఆర్ ఫ్రమ్.. సి.బి.ఐ..", అని సినిమాల్లో అన్నట్టుగా.. జేబులోంచి.. కంపెనీ ఇచ్చిన హెల్త్ కార్ట్ చూపిస్తూ.. "ఇవిచ్చింది ఎందుకు మనకూ..., ఈ కార్టు ఎంత పవర్ ఫుల్ అంటే.. దీన్ని నువ్వు హాస్పిటల్ బయటున్న సెక్యూరిటీ వాడికి చూపించినా చాలు.., వాడే డాక్టరయిపోయి.. నీకు వేసెక్టమీ ఆపరేషన్ చేసేయ్యటాకైనా రడీ అయిపోతాడు", అన్నాడు చుండ్రు రమణ.
"సరే పద.., ఆ ఆపరేషన్ తో కడుపుక్లీన్ అవుతుందంటే.. సెక్యూరిటీ వాడు చేస్తే ఎంటి.. జనరేటర్ రూమ్‌లో వాడు చేస్తేఎంటి.. నేను చేయించేసుకుంటా..మీరూ వస్తున్నారా", అని కార్టుతీసుకుని చేత్తో పట్టుకుని రడీ అయిపోయి నడుచుకంటూ వెళ్ళిపోయాడు.. నల్లశీను.
"ఒరే..ఆగు.. ఆ ఆపరేషన్ కడుపు క్లీన్ చేయించుకోటానికి కాదురా.. బాబూ.., నీకెలా చెప్పేది..", అని వాడివెనకే పరిగెత్తుతూ.. అంతా దగ్గర్లోవున్న బడా కార్పొరేట్ హాస్పిటల్ కి చేరుకున్నారు.
అయ్యో రీల్ తెగిపోయింది.. (కధలో కాదు.. బయట..)
కాసేపు విరామం.. (విరామం అన్నప్పుడు ఏడ్స్ చూడటం అలవాటయ్యిపోతే.. కుడిపక్కకిందనున్న ఏడ్స్ పై క్లిక్ చేసుకోవచ్చు.. :-) )
మిగతాది రీల్ కి అతికించిన ఫెవీక్విక్ ఆరి.. బాగా సెట్టయ్యాకా.. :-)

8 కామెంట్లు:
ఐ!...నా సమోసాలు ఐపోయేలోపే రెండో పార్ట్ వేసేశారే! మీకు ఆడియన్స్ నాడి బాగా తెలుసే!
చీకటిపడటంతో ఇంటి వాతావరణం మారిపోయింది. బొండుభద్రం.. నల్లశీను.. కుక్కల సతీష్.. చుండ్రురమణ..ఇంకా మరో ఇద్దరితో.. ఇల్లు బార్ లాగా కలకలలాడిపోయింది కాదు కాదు.. కలకలలాడే బార్ లాగా అయిపోయింది.. అబ్బాఇదీ కాదు.. ఇల్లులో కలకలలు బార్ లాగా అయిపోయాయి.. (ష్.ష్.. మీకు అర్ధమయ్యిందనే అనుకుంటున్నా!!.., అదే సినిమా అయితేనా ఈ సీనుకు.. గుణశేఖర్ లా నాలుగుకోట్లుపెట్టి పెద్దసెట్ వేయించి చూపించేవాడిని.., అఫ్ కోర్స్.. నిర్మాత వెఱ్ఱిబుజ్జి అయితే)
హహ్హహ్హ...........:):)చాలా చాలా బాగుందండి.
మీ టపాలన్నింటిని చదివేశానండి. చాలా బాగున్నాయి. మీ రచనా శైలి కూడా అద్భుతం. కొన్ని నిడివి ఎక్కువ అవడం వల్లా కొంచెం కష్టం అనిపించినా బాగుండటం వలన అసలు ఆ ఇబ్బందే తెలియలేదు.
@కౌటిల్యగారు
పాఠకుల నాడి-బ్లడ్ ప్రెషరు.. బి.పి-షుగరూ... మధుమేహం-కాలేయం... లివరు-కిడ్నీ.. మూత్రాశయం-పిత్తాశయం తెలుసుకోవటానికి నేనేమన్నా 'డాక్టర్‌నా' చెప్పండి.. :-), ఏదో నాకుతెలిసినవాటిలో నాలుగు ముక్కలను.. ఎనిమిది ముక్కలుగా.. రాసుకుంటున్నచిన్నబ్లాగర్ ని గానీ.
అదిసరేగానీ.. అన్ని సమోసాలు మీరే ఏంతింటారులేండి.. కాసిన్ని మాకుకూడా ఎక్కడన్నా అప్లోడ్ చెయ్యండి.. ఫ్రీగా డౌన్లోడు చేసుకుంటాం.. :)
@రాధిక(నాని) గారు.
నచ్చినందుకు సంతోషం.. బాగా నవ్వుకున్నట్లున్నారు.
మీ నవ్వులో నాకు సహనిర్మాత కనిపిస్తున్నారు.. కనీసం సగం పెట్టుబడైనా పెట్టగలరా.., ఇదే స్టోరీ (మొదటిభాగాన్ని) సినిమా తీద్దాం.. :-), ఆ మహా అయితే ఎంతవుతుందండీ.. 4 లక్షలే (డాలర్స్..$$$)
@రఘురామ్ గారు
మీ కామెంటుకు ధన్యవాదములు. నా శైలి నచ్చినందుకు ఆనందంగావుంది. ఇలానే చదువుతుంటారని ఆశిస్తున్నాను.
హబ్బో! మీకు వంట్లో పార్టులు చాలా తెలుసట్టుందే!....కాని తెలుగులో, ఇంగ్లీషులో తేడాలు ఆట్టే తెలిసినట్టు లేదు...లివరు=కాలేయం..:-)..మూత్రాశయాన్ని, పిత్తాశయాన్ని ఒక గాటన కట్టారేంటి?..పిత్తాశయం అంటే మరోరకంగా అనుకున్నారేమో;))..గాల్ బ్లాడర్ నే పిత్తాశయం అంటారండీ.......
నాలుగుని ఎనిమిది చేస్తున్నారా! ఎల్లాగబ్బా!;))....
సీనియర్లు మీరే "చిన్న" బ్లాగర్ ఐతే మేం "చితక" బ్లాగర్లమా!.....మరో సంగతి! ఈ "సమోసాలు" అప్లోడులు, డౌన్లోడులు తెలియటానికి మేమేమన్నా"సాఫ్టువేరో"ళ్ళమా...ఏదో పాటలూ,సినిమాలు చేసుకోగలమేమో కాని......;)))
@కౌటిల్యగారు
ఏదో మీ అభిమానం.. సాఫ్ట్వేర్ వాళ్ళమీద :-)
ధన్యవాదములు.
mee migatha vatitho choostey naku nachaledu ee series...dont mind
@శిరీష గారు
కామెడీని రకరకాలుగా పండించాలి... నవవిధ మషాళాల దట్టించి రాయాలి.. అలా రాయగలనా లేదా అనే ప్రయత్నంలో పడి.., కాస్త.. ఛీప్ అండ్ ఎక్ట్రీమ్ కామెడీ ట్రైచేద్దామని ట్రై చేసి బోల్తాపడ్డానని "బకాసురులు - 2" రాసేటప్పటికే జనాల రెస్పాన్సును బట్టి నాకు అర్ధమయ్యిపోయింది.
అందుకే.. మూడొవ పార్టు రాసే మూడ్ కూడా రాలేదు.
అలా అని ఈ సీరిస్.. పూర్తిగా చెత్త అని నేననను.. ఎప్పుడూ చదివే రెగ్యులర్ రీడర్స్ ఎక్స్పెట్టుచేసేది కాదని అని మాత్రం అనుకోగలను. అంటే.. ఒక సినిమా క్లాస్ ప్రేక్షకులకోసం.. ఒక సినిమా మాస్ ప్రేక్షకులకోసం తీసినట్టుగా కాస్త వైవిధ్య ప్రదర్శన అన్నమాట.
నచ్చలేదన్న విషయాన్ని నాకు ఎవరూ చెప్పలేదండీ.. చాలా అన్యాయం కదా!!.
కామెంటుద్వారా చెప్పిన మొదటివారు మీరే.. అందుకు చాలా చాలా ధన్యవాదములు. :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి