27, సెప్టెంబర్ 2007, గురువారం

స్వరరాగ గంగా ప్రవాహం...



 
ఆఫీసునుండి.. అలసిపోయి.. వస్తూ.. హెడ్పోన్స్ లో ఒక మంచి పాట వింటున్నా...
ఆహా.. ఎంత బాగుంది.. అని ఒక్కసారి నా ఈ రోజు టెన్సన్స్ అన్నీ మరచిపోయా.. అలసిన
మనసుకు ఒక చెట్టు నీడలా ఆపాట తోచింది.. కాసేపు విశ్రాంతి కోరింది..
సేద తీరాను..
"సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే...." , (సీతాకోక చిలుక చిత్రంలోనిది..)
ఎంత చక్కటి పాట.. ఏముందో తెలియదు ఈ పాటలో.. నేను వరుసగా.. వందసార్లు.. విన్నా
ఇంకా వినసొంపుగానే ఉంటుంది..., ఈ పాటలో వీణతో పలికించిన సంగీతం..
ఎంత ఎమోషనల్ గా ఉంటుందో.. చెప్పలేను...., వింటుంటేనే  మదిలో కదులుతున్న ఏవో భావాలు...
కెరటాలుగా...అనిపిస్తాయి.. పాటకు తగ్గట్టు బాలు పాడిన తీరు.. ఇంకెవరూ సాటిరారు అనిపిస్తుంది..
 
నేను ఎంత  చికాకులో ఉన్నా, అలసటగా ఉన్నా సరే వినగానే ప్రాణంలేచొస్తుంది...
మహానుభావుడు.. ఇళయరాజా.. ఎలా చేసారో కానీ.. దీనికి..స్వరకల్పన..
నిజంగా మెచ్చుకోకుండా ఉండలేం. ఇంకా చెప్పుకోదగ్గ పాటలు చాలానే ఉన్నాయి
 
ఆయన మనసులో ఉన్న భావాలను సంగీతంలా పిలికిస్తారేమో..తెలియదు..
ఆ సంగీతంలో కూడా భావాలు పలుకుతుంటాయి...
పాడేవారు అవసరంలేదు అన్నట్లు..గాయని/గాయకుడు పాడలేని శృతిని, భావాన్ని.. 
అందులో ఉన్న వాయిద్యం పలికిస్తుంది...,
 
నాకు కాస్త ఎమోషనల్ సాంగ్స్ అంటే ఇష్టం,  పాటను ఎదో వింటున్నా అన్నట్లు కాకుండా..
పాటలోని ప్రతీ వాయిద్యం పలికే తీరును...చాలా శ్రద్దగా.. పరిశీలించడమంటే ఇష్టం...
 
ఆయన పాటల్లోని వాయిద్యాలు... ఇలా వచ్చి కూసి అలా వెళ్ళిపోయె కోయిలలా ఉంటాయి... అది నాకు
బాగా నచ్చుతుంది..., ఆ పాటతో పాటుగా వింటే.. అవి కోయిల కూతలా.. వినసొంపుగా ఉంటాయి...
కొన్ని కొన్ని స్వరాలు.. విడిగా వింటే.. చిన్నప్పుడు కొబ్బరాకుతో చేసిన బూర.. సరిగ్గా పలుకుతుందోలేదో అని
సరిచూసుకున్నట్లుండి చిలిపిగా నవ్వొస్తుంటుంది.. కానీ అటివంటి అపస్వరాన్ని కూడా స్వరకలయికతో.. ఒక
సుస్వరంగా మార్చగల ప్రతిభ నేను గమనించినదానిని బట్టి..  ఒక్క ఇళయరాజాదే..
 
సంగీతానికి చాలా పవరుంది... ఎటువంటి భావం అయినా వ్యక్తం చేయటం సంగీతంతో సాధ్యం...
ఇది నేను నమ్ముతాను...
ప్రశాంతమైన వాతావరణంలో కనులు మూసుకుని.. చక్కటి పాటని వింటూ, స్వరాలను గమనిస్తూ
ఆ స్వరాలకనుకూలంగా... మనసుని నాట్యంచేయిస్తుంటే.. ఆహా.. ఇంతకన్నా ఆనందం ఉంటుందా..!!
ఏమో నాకైతే... ఏదీ అంత ఆనందాన్ని ఇవ్వవనిపిస్తుంది...
 
సంగీతం ఎలా పుట్టిందో.. ఎలా పెరిగిందో చెప్పటానికి నా వయసు.. నా జ్ఞనం సరిపోవుకానీ... మనకు అదొక
వరమే..., ఎప్పట్నండో నాకు నేర్చుకోవాలని కోరిక..., సమయం కుదరక నెట్టుకొస్తున్నా.. కానీ కనీసం
చిరు ప్రయత్నమైనా చెయ్యాలి.. ఏదోక వాయిద్యం నేర్చుకోవాలి..
 
అబ్బా..ఆ అమ్మాయి చూడు ఎంత బాగా పాడుతుందో.. ఆహా ఆ అబ్బాయి.. గొంతు నిజంగా వరం..
అనుకుంటుంటాం.. మనకు పాడే ప్రతిభలేదు.. గొంతుదేవుడివ్వలేదు అని బాధపడుతుంటాం...
ఖచ్చితంగా.. ఇలాంటి కోరికలను.. ఏదోక సంగీతవాద్యాన్ని నేర్చుకుంటే తీర్చుకోగలం.. అని అనిపిస్తుంది..
 
ప్రియుని జాడ వెతుకుతున్న ప్రియురాలిని... నేను..
ప్రేమలోన దాగిఉన్న అమృతాలను తాగాలని.. ఆశగా ఎదురుచూస్తున్న
ప్రియసఖినే నేను, అని ప్రేయసి ప్రియుని కోసం రాసుకున్న పదాలు..
 
మధురసరాగంలో మృదుమురళిని మ్రోగించగ మదిలోన కదిలేటి.. భావమై
చెలియా తాళంలోన మనసును పలికించగ హృదయంలో వినిపించే రాగమై
 
లాంటి.. పువ్వులంటి.. పదాలను.. స్వరమాలలో కూర్చి.. ఒక పాటగా మార్చితే...
ఆ పదాలలోని కనిపించని అందాలు.. బయటపడి.. భావానికి మరింత వన్నెతెస్తాయి..
 
సంగీతానికి.. అంత వన్నెవుంది..మరి..,
ఎన్నో రీతులుగా.. ఎన్నో దారులలో..., వైవిధ్యభరితముగా... కాలానుగుణంగా సంగీతం మారుతున్నా...., దానిపై ఉన్న ప్రేమను వీడక.., మక్కువ వదలక,  ఇంకా సంగీతానికి జీవంపోస్తూ.. అందరినీ అలరిస్తున్న సంగీతకారులకు..., మహానుభావులకు... వందనం అభివందనం...
ఆ స్వరరాగగంగా ప్రవాహంలొ స్నానాలు చేసి తరిస్తూ ఆనదిస్తున్న శ్రోతలకు కూడా...!!!

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కళల గొప్పతనమంటేనే అది. నాకూ అనిపిస్తూంటుంది. కిందా మీదా పడి, ఇంగిలిపీసు చదువులు చదివి డబ్బులు సంపాదించాక కూడా, ఓ మంచి కళాకారుడి పాటలు వినటానికో, నాట్యం చూడ్డానికో దూరతీరాలకు వెళ్ళి వినొస్తాము. ఎన్ని కోట్లు సంపాదించినా రాని పేరు ప్రతిష్టలు కళాకారుడికి వస్తాయి. అదే కళల గొప్పతనం. ఇది విశ్వజనీనమయిన సత్యం.

కొత్త పాళీ చెప్పారు...

Beautiful.

Please take care of the numerous typos

kishore kumar sannapaneni చెప్పారు...

"స్వరరాగ గంగా ప్రవాహం..."
అని చుడగానె నేను సరిగమలు సినిమాలో పాట అనుకొన్నాను. మీరు ఇళయరాజా గురించి రాశారు. నిజంగా మీరు రాసింది చాలా సార్లు నాకు అనిపించింది. ఆయన పాటల్లో ఏదో ఒక తీయని అనుభూతి ఉంటుంది. ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది. నాకు చాలా సార్లు అనిపించింది. ఇది కేవలం నా పిచ్హా లేక కొందరికైన ఇలా అనిపిస్తుందా అని. సంగీతమైనా సాహిత్యమైనా కళయొక్క గొప్పదనం కళదే. కళతో మానసికోల్లసం కలుగుతుంది. ఆందుకే సంగీతం రోగాల్ని కూడా నయం చేస్తుంది అంటారు. సరిగమలు సినిమ కూడా ఇదే విషయం పైన ఉంటుంది.

GKK చెప్పారు...

ఈ పాట వానలో నా ఆత్మ స్నానమాడె

రాధిక చెప్పారు...

సంగీతం తో సేదతీరగలగడం ఒక యోగం.అందరూ ఆశ్వాదించలేరు.

కొత్త పాళీ చెప్పారు...

పైన వికటకవిగారి వ్యాఖ్య చూశాక నా సహోద్యోగి డెస్కుమీదున్న కేలెండరులో ఒక కార్టూను గుర్తొస్తోంది. ఒక తండ్రి సుమారు ఐదేళ్ళ వయసున్న కొడుకుని వొళ్ళో కూర్చోబెట్టుకుని చెబుతుంటాడు .."Son, one day you will meet and marry a beautiful young woman. And you will even keep her happy for some time. Then she will ditch you in favor of another man who will keep her happy forever. Such men are called MUSICIANS!" :-))

Unknown చెప్పారు...

ఇళయరాజా సంగీతం కొన్ని సార్లు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది.
మంచి టపా.

Unknown చెప్పారు...

Ilayiaraja -- Devendrudi sabhalo koorchuni devathala mundu music play cheyalsina aayana porapaatuna ee Bhoomi meeda puttaru...

God of Music.

Related Posts Plugin for WordPress, Blogger...