ఛ...!!, ఏంటీ.. పెళ్ళిగోల...
* ఆరోగ్యం పాడువుతుందిరా ఈ హోటల్ భోజనం.. ఆఫీసులో క్యాంటిన్ భోజనం తినలేకపోతున్నాను..
అనటం పాపం.. అంటాడు.. ఎవడోకడు.... ఐతే ఏముంది.. త్వరగా పెళ్ళిచేసుకో.. కావలిసినవన్నీ వండిపెడుతుంది..
అదొక్కటే మార్గమా.. ఏ మనం వంట చేసుకోలేమా.. వచ్చకా కూడా మనం ఆ అమ్మాయికి..వండిపెట్టకుండా
ఉంటే చాలు.., అయినా పెళ్ళికి.. వంటకి, తిండికి లింకేంటో??..
*ఆఫిసులో పని ఎక్కువైపోయిందిరా.... చస్తున్నా. ఇక వెళతాను అంటే చాలు.. అప్పుడే వెళ్ళి ఏంచేస్తావ్.
పెళ్ళామా పిల్లలా.. అని వెటకారం చేస్తున్నాడురా.. మా మేనేజరు...అని ఎవడితో మొరపెట్టుకున్నా
మరందుకే. పెళ్ళిచేసుకోమనేది.. అని అంటారు.. ఇక్కడ కూడా.. మరి ఏంటో లింకు..
ఏ పెళ్లి కానివాళ్ళు.. కాసేపు.. ఇంటికెళ్ళి..హాయిగా ప్రశాంతంగా ఉండలేరా??,
నచ్చిన హాబీని ఎంజాయ్ చెయ్యలేరా?
*ఏమండీ.. ఇక్కడ టూలెట్ బోర్డ్ ఉంది.. ఇల్లు అద్దెకు ఇస్తారా.. అంటే.. మొదట.. అడికే ప్రశ్న..
బ్యాచ్ లర్స్ ఆ..??
అయితే ఇవ్వమండి.. ప్యామిలీకే..
ఓహో.... మరి.. బ్యాచిలర్స్.. ఫుట్ పాతలపై పడుకోవాలా...?, పెళ్ళికాకముందు అందరూ బ్యాచ్ లర్సే.. కాదా..
ఇక్కడ కూడా లింకుపెట్టేసార్రా బాబు..
* సింగిల్ గా బైక్ పై పాటలు పాడుకుంటు.. హాయిగా వెళుతుంటే.., ఎవడో బేవార్స్ గాడు..
చేయిచాపి.. లిఫ్ట్.. అంటే..ఈ పాటల మూడ్ పోగొట్టుకోలేక.. ఎహే.. నేనివ్వను అని చిరాగ్గా వెళ్ళిపోతే..
ఏ.. అలా ఒక్కడివే ఫొకపోతే.. లిఫ్ట్ ఇవ్వొచ్చుగా..? అని తిడుతున్నాడు..
ఇదెక్కడ గోలరా.... నా బైకుమీద.. నాకు నచ్చిన పాటపాడుకంటూ ఒంటరిగా వెళ్ళే హక్కులేదా.. అంటే..
మరందుకేరా పెళ్ళి.. అని మళ్ళీ లింకు పెట్టేసారు..
*అలాగే సినిమా హాల్లో.. కాస్త అక్కడ కూర్చుంటారా.. లేడిసున్నారు. మీరొక్కరే కదా.. అని బ్రతిమలాడి
చివరిసీటు ఇస్తే.. గాలిఆడక.. చెమటలు తుడుచుకుంటూ. సినిమా చూస్తుంటే.. ప్రక్కవాడు పిచ్చినవ్వు నవ్వి..
మీరు సింగిలేనా.. నేను అంతే.. అందుకే పెళ్ళిచేసుకోమని పెద్దలు చెప్పేది.. లేకపోతే ఇలాగే తోసేస్తారు.. అంటున్నాడు
వెటకారంగా..
ఓహో దీనికీ పెళ్ళికి మళ్ళీ లింకా..
* ఊరెళ్లేటప్పుడు.. చాలా రోజుల ముందు ముందుజాగ్రత్తతో టికెట్ రిజర్వ్ చేసుకుని మిడిల్ బెర్త్ తీసుకుంటే..
బాబూ.. బ్యాచిలరా..!, మేం ఫ్యామిలీ.. కాస్త సైడప్పర్ బెర్తులో ఎడ్జస్ట్ అవుతారా.. అని రిక్వస్ట్...చేస్తే..
పోనీలే అని.. మూటకట్టి.. అటకపైకి ఎక్కించినట్లుగా.. ముడుచుకుని.. పడుకుని జర్నీచేసి.. నడుంపట్టేస్తే..
మరందుకే పెళ్ళిచేసుకోవాలి.. ఎవడూ రిక్వస్ట్ చేయడు.. అంటాడు పక్కోడు..
మళ్ళీ ఇదో లింకు..
*అబ్బా ఎప్పుడూ ఈ రూమ్‌లో బోర్ కొడుతుందిరా.. లైఫ్. పద అలా బయటకుపోదాం ఏ పార్కుకో బీచ్ కో.. లేక
డిస్కోకో.. అంటే.. ఎ.. వెళ్ళి ఏంచేస్తావురా.. బటానీలు తింటూ. అక్కడికొచ్చే... జంటలను చూసి
మనసుపాడుచేసుకుంటూ...
ఆ బటానీలు అమ్మేవాడితో బాతాఖనీ కొట్టడం తప్ప.. ఇక డిస్క్ కి పోవాలంటే.. పక్కన అమ్మాయి కావాలి.. అందుకే
బాబుపెళ్ళిచేసుకో...
ఓరినాయనో.. మళ్ళి అక్కడికే వచ్చార్రా....
*ఇల్లుకొనటానికి హౌసింగ్ లోన్ అప్లై చేస్తున్నారా... ఏదిబాగుంటుందో చెప్పరా తెలిసుంటే...అనగానె పక్కోడు..
తగులుకుని.. ఒరే.. పిచ్చి బామ్మర్దీ.. ఇల్లు కాదు నువ్వు కొనాల్సింది. .
ఇప్పుడు.. కార్ లోన్ పెట్టి.... ఒక మంచి కారుకొను.
నాలుగు చైనులు.. రెండుచేతులకీ.. బ్రాస్లెట్టు.. ఉంగరాలు.. చేయించుకుని.., సూటేసుకని.. ఖాలీ సూట్‌కేసుతో
అటుఇటూ తిరిగి..హడావుడి చెయ్యి.... ఇక పడతారు..సౌండున్న స్పోన్సర్స్... బ్లాక్ సుమోల్లో దిగి.. ఎగబడతారు..
అందర్ని లైన్లో నిలబెట్టి.. ఎవడికైతే.... బంజారాహిల్స్ లోనో.. హైటెక్ సిటీ ప్రక్కనో ఇల్లు ఉందో చూసి... ఒకే అన్నావంటె..
పిల్లనిచ్చి పెళ్ళిచేయగానే.. అమ్మాయితోపాటు.. కొత్తఫ్లాటు లక్ష్మీదేవిలా.. వస్తుంది.. ఆ అమ్మాయి చదువుకుని
ఉద్యోగం చేస్తుందా..!!, అయితే... ఇంకా నయం.. అప్పుడు హోమ్ లోన్ పెట్టి ఇల్లుకొను.. ఆ అమ్మాయి జీతం నెలనెలా లోన్ కట్టు..
ని జీతంతో కార్ తో పాటు.. ప్యామీలీ మెయిటెన్ చెయ్యి..
అదీ.. పెళ్ళిచేస్కో.. ఒక్కదెబ్బకు రెండు ఇల్లులు.. అని అదో లింకు..
* ఆహా.. వర్షం భలే పడుతుంది.. వాతావరణం చాలా బాగుంది.. ఇప్పుడు బయటకివెళితె.. బాగుంటుంది అంటే..
బాసూ.. నువ్వు బయటకెళ్ళినా, లొపలున్నా, ఆఫిసు ఎగ్గొట్టి.. ఇంటికెళ్ళినా ఒకటే బాసు.. పెళ్ళయ్యిందా ఎమైనానా?? అని వెటకారం.
* నా జుట్టు చూడు ఎంత పలచబడిందో.. ఒక్కసారిగా.. అరెకరం ఖాలీ ఐపోయిందిరా.. అంటె..
పెళ్ళిచేసుకో బాబు.. లేకపోతే.. ఆ ఉన్నది కాస్త పోతుంది.. అంటాడు పక్కోడు..
అదేంటిరా.. మరి పెళ్ళిచేసుకుంటె.. పోయింది వస్తుందా?... లేక.. పెళ్ళయిపోయాకా బట్టతల ఐనా పర్వాలేదా? అంటే చెప్పరు కానీ లింకు మాత్రం పెడతారు..
*అబ్బా ఈ నసగాడు చంపేస్తున్నాడే.. మా డాడి ఉన్నప్పుడే..
ఫోన్ చేస్తాడు.. కుల్లుజోకులేసి.. చావగొడుతున్నాడే.. అని
తని స్నేహితురాలికి చెప్పుకున్న పాపానికి.. ఆ అమ్మాయి ఇచ్చిన సలహా..
అందుకే చెప్పేది. మీ వాళ్ళు తెచ్చిన సంభంధం ఒకే అను.. అ ఆర్కుట్లో సింగిల్ అన్న స్టాటస్ ని.. మ్యారీడ్ అను మార్చు..
వెంటనే అతని మొబైల్.. ఎడ్రస్ లిస్ట్ లోంచి నీ నెంబరు డిలీట్ కొడతాడు.. ఆర్కుట్ స్రాపుబుక్ ఖాలిగా ఉంటుంది కూడా..
అని లింకు పెట్టింది మళ్ళీ... ఫ్రండ్ కాస్త నసపెడితే అదీ పెళ్ళికి లింకే??
*నా ఈ కాస్మోటిక్స్ కే అయిపోతుందే సగం జీతం అంతా.. ఎలా ఖర్చుపెడుతున్నానో నాచేతులమీదుగా అనిపస్తుంది..
అందుకెనే.. త్వరగా పెళ్ళిచేసుకో.. అతని చేతులమీదుగా కొనుక్కోవచ్చు...
అంటే.. అవి కొనుక్కోవడానికి ఇప్పుడు పెళ్ళే చేసుకోవాలా?
*ఏంటమ్మా చెల్లెమ్మా.... మన పద్దూ రోజురోజుకు లావెక్కుతుందీ.. ఇలా ఐతే కష్టం.. రేపు పెళ్ళిచెయ్యాలి.. కాస్త స్వీట్స్..
ఐస్‌క్రీమ్స్ తిననివ్వొద్దు.. కంట్రోల్ లో పెట్టండి.. అలానే.. వంటలు చేయటం ఇంటిపనులు చేసుకోవటంలాంటివి
నేర్పించండి.. కాస్త ఎక్సర్సైజు గా ఉంటుంది కూడా, నాకంటావా ఆ కంట్రోల్ లేకపోయింది.. అందుకె.. ఇప్పుడు కొలెస్ట్రాల్..
డయాబెటిస్.. అని.. పనిలెని మావయ్యలు అమ్మలకు.. చెప్పే చచ్చు సలహాలలో కూడా.. లింకులు ఉంటాయి....
వాళ్ళుమాత్రం.. మెక్కి.. లావెక్కుతారు.. రూలు అందరికీ ఒకటె కాదా??
*ఈ ట్రాఫిక్ రానురాను ఎక్కువైపోతుందే.. పంజాగుట్టనుండి అమీర్ పేట సిగ్నల్ కి రావటానికి.. గంటపట్టింది.. డ్రయివ్
చేయలేక చస్తున్నానే..
అందుకేనే పెళ్ళిచేసుకో.. అతనే డ్రయివ్ చేస్తాడు.. వెనుక కూర్చోబెట్టుకుని.. అంటుంది... ఇది.. మరీనూ...!!!
*పొద్దున్న లేచిందగ్గరనుండి.. గాడిదలా ఆఫీసులో పనిచేస్తుంటే.. ఇంకా అదవలేదు ఇది పెండింగుంది.. అని నసుగుతున్నారే..
అనగానే ఇచ్చే సలహా.. ఎవడన్నా అమెరికా సంభందం పట్టు...నువ్వు ఇంట్లో కూర్చోవడమే.. సాయంత్రానికి డాలర్స్ మూట
పట్టుకొస్తే.. నువ్వు లెక్కపెట్టుకోవటమే.. అని పెళ్ళికి మళ్ళీ..లింకు..
ఇవన్నీ చెబుతున్నారు.. ఇంతకూ.. పెళ్ళికి మన ఆనందాలన్నిటికీ.... అంత లింకు ఉందా అనుకుంటే..
మరి.. ఇవి...
*ఆరోజు కూడా ఇంటర్వూ ఫేయిలయ్యి వచ్చిన అమ్మాయిని.. నిలదీసి.. చెప్పానా.. నీకు.. మగాడిలా ఉద్యోగం వద్దే అని..
పెళ్ళిచేసేస్తే.. నువ్వు మాటవింటావ్..
*వీడు చాలా ఎక్కువచేస్తున్నాడ్రా.. పెళ్ళిచేస్తేనే కాని పిచ్చి కుదరదు.. వీడికి..
*ఎంత జీతమొచ్చినా సరిపోవడంలేదురా.. అంటే. అప్పుడే ఏమయ్యింది.. పెళ్ళయ్యాకా తెలుస్తుంది.. అసలు బాధ..
*ఒరే.. నన్ను లెక్కేయకండిరా.. మీ పార్టీలు.. పాడూ..కానీ.. అసలే పెళ్ళయినవాడిని.. నన్నిలా బ్రతకనీయండిరా..
అంటే.. అంత భయంకరంగా ఉంటుందా... ??
ఎక్కడికెళ్ళినా ప్రశంతతలేదు.. అందరూ చెబుతున్న బోడి సలహాలు.... ఇవి.. చంపేస్తున్నారు..
పోనీ పెళ్ళితో సమస్యలు తీరిపోయాయా..అంటే..
కొత్తగా పెళ్ళయ్యి.. ఒక సంవత్సరం అయిన జంటలను.. ఎవరినైనా.. దయచేసి అడిగే ప్రయత్నం కూడా చెయ్యొద్దు..
పైన విన్నవాటికన్నా భయంకరంగా సమస్యలు ఉంటాయ్.. అని చెబుతారు.. తరువాత మీ ఇష్టం..
ఆనందం అంటే తెలియని వాళ్ళ సెటైర్స్.. సంగతి ఎలా ఉన్నాకానీ..
లైఫ్..ని ఎంజాయ్ చెయ్యడం తెలిస్తే.. నీరో చక్కవర్తిలాగా.. రోమ్ నగరం.. మునిగిపోతున్నా
ఫిడేలువాయించుకుంటూ.. ఆనందించొచ్చు...
మనకున్న ఏదొక హాబీని.. ఎంజాయ్ చేస్తూ.. స్నేహితులతో చెట్టాపట్టావేసుకుని.. హాయిగా నవ్వుకుంటూ
తిరిగేద్దాం..
ఏదో ఎప్పుడో వస్తుందీ.. రాబోతుందీ.. అని.. టైమ్ వేస్ట్ చేసుకునే కంటే.. ఇప్పుడు ఏంచేస్తున్నామో అన్నది ముఖ్యంకాదా?
నెవర్ కాంప్రమైజ్.. లివ్ యువర్ లైఫ్.. అంతే...
----------------------------------------------------------------
(పెళ్ళి ఎప్పుడు బ్రదర్.. అని. గుచ్చి గుచ్చి అడిగి.., పనికిరాని చచ్చుసలహాలిచ్చి..చావగొట్టే.. మహానుభావుల పాదపద్మములకు.. అంకింతం..)
11 కామెంట్లు:
బావుందండి :)
మరేవనుకున్నారు .. పెళ్ళి తో వచ్చిన తంటానే అదండి .. ఆయ్ :)
పీత కష్టాలు పీతవి...
మీకు ఖచ్చితంగా కళ్యాణ సమయమాసన్నమైందండి..లేకపోతే ప్రతిదానికీ మీకు పెళ్లే గోచరిస్తుందేంటబ్బా? సీరియస్‌గా ఆ చేతికీ ఈ చేతికి రెండు లావాటి ఉంగారాలు పెట్టేసి..మీ బాసడిగితే మా ఆవిడిప్పుడే అనకాపల్లి నుండి దిగిందని చెప్పేయండి ఓ పనైపోతుంది.
వామ్మో ఇన్ని సమస్యలకి పెళ్ళే తోస్తుందంటే రవి గారన్నట్టు మీకు పెళ్ళి వయసు వచ్చినట్టే. పెళ్ళి చేసుకోండి ;)
యింత పెద్ద వ్యాసం, అన్ని రకాలుగా ఆలోచించి వ్రాసినందుకు అందుకోండి నా ధన్యవాదాలు.
ముందు మీరు అమ్మాయిల వైపు నుంచీ, పెళ్ళి మోజు తీరిన వారి వైపు నుంచీ కూడా కొన్ని మాటలు రాసినందుకు ధన్యవాదాలు.
పెళ్ళికి ముందు 2 wheeler కావాలంటే, ఎందుకూ, పెళ్ళయ్యాక కారూ, కారు డ్రైవరూ కూడా ఉంటారు అని చెప్పే వారు. అసలు భయం, కింద పడి ఏ కాలో చెయ్యో విరక్కొట్టుకుంటే పెళ్ళెవరు చేసుకుంటారు అని.
అలాగే onsite assignment గురించి అడుగుదామనుకుంటుంటే non-IT వాళ్ళని పెళ్ళి చేసుకున్న అమ్మాయిలు, "మీ లాంటి వాళ్ళు (పెళ్ళి మార్కెట్లో) hot cakes" అంటారు, పెళ్ళి చేసుకుని రాజ మార్గంలో వెళ్ళోచ్చు, H1 కష్టాలు ఎందుకు అన్నట్టు. అవతల అబ్బాయిల తల్లి దండ్రులేమో offshore recruiters లాగా potential ఉన్న అమ్మాయిల short list తయారు చేస్తుంటారు.
నిజంగానే శ్రీనివాసుకి పెళ్ళి మీదకు మనసు మళ్ళింది. అందుకే ఈ డొంక తిరుగుడు...
సోది గా,హైద్రబాద్ వెళ్ళకా సోది ఏక్కువ రాస్తున్నవురా
ఏమిటో ఈ పెళ్ళి గోల?ఈయనకి పెళ్ళి చేసేస్తేనే గానీ ఆపేలా లేరు.[మళ్లా ఇక్కడ కూడా పెళ్ళికి ఇంకేమిటిరా బాబూ]
ఆయ్! మన రాజు గారబ్బాయి బొంబయి నుండి హైదరాబాద్ వచ్చాక పెళ్ళి మీద ఎవో రాతలు రాస్తుండాడంట. పెద రాజు గారికి చెప్పి పెళ్ళి చేచెయ్యమనండి ఆయ్!
-నేనుసైతం
చివరివరకూ దాగిన నవ్వు చివర్లో "అంకితం" చూసి బయటకురాక తప్పిందికాదు. నా ఉద్దేశంలో పెళ్లి ఒక Necessary Evil. ఇలాంటి ఆలోచనలే నేనూ ఒకసారి చేశాను. కానీ మీలాగా ఒక నిర్ణయానికి రాలేకపోయాను. చూడండోసారి. నాకప్పటికి తెలుగు బ్లాగులగురించి తెలియదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి