27, మే 2007, ఆదివారం

బ్రహ్మీ సాప్ట్వేర్ ఇంజనీర్..


(This Post Contains some Slangs .. READERS DISCRETION ADVISED

కొన్ని చోట్ల తప్పక.. పరుషపదాలు ఉపయోగించడమైనది.. ఇబ్బంది అయితే చదువవద్దని మనవి... క్షమించగలరు....)

ఎంత వెటకారం అయిపోయింది.. ప్రతి ఒక్కడికి లోకువగానే ఉంది. కనిపించినంత సులువుకాదు.. సుఖమూ..లేదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే…

ఈ మధ్య ప్రతి ఒక్కడికి సులువుగా ఉద్యోగాలు రావడంవలన అనుకుంట ఈ ఫీల్డ్ అంటే లోకువ కట్టేసారు.. వైట్ కాలర్ జాబ్.. సుఖంగా కూర్చీలోంచి కదలకుండా.. చాటింగ్ చేసుకుంటూ.. పాటలు వింటూ.. ఎంజాయ్ చేస్తూ.. వారానికి రొండు రోజులు సెలవు తీసుకుంటూ.. పని తక్కువ పైసలు ఎక్కువ .. ఇవే తెలిసినవి పైకి.. తెలియని విషయాలు చాలా ఉన్నాయి…

ఏసీలో చెమటలు… కుర్చీలో అయస్కాంతాలు… పియల్ చేత అక్షింతలు.. మీటింగుల్లో ఒకరిపైఒకరి నీలాపనిందలు.. అమ్మో.. బాబోయ్ అని మనసులోనే అనుకుంటూ… పైకి నవ్వుతూ నటనలు చేయటాలు.. ఏం చెప్పమంటారు.. అది చెబితే తెలియదులేండి అనుభవించాలి…

ఒకోరోజు.. ప్రక్కసీటులోవాడు వచ్చాడోలేదో తెలియకుండా పనిచేయాల్సొస్తుంది.. అంటే మీరే అర్ధంచేసుకోండి.. అన్ని ఉద్యోగాలు అలానే ఉంటాయి కాదనటంలేదు..

కానీ ఈ ఫీల్డ్ కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే..

ఉంటే.... చాటింగ్ చేసుకుంటూ… క్యాంటిన్ లో పౌడర్ టీలు అవసరంఉన్నా లేకున్నా తాగుతూ.. కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకునెంత టైముంటుంది

లేకపోతే.. పెళ్ళాం ముద్దుగా ఫోన్ చేసినా చిరాకుగా మాట్లాడేంత పనుంటుంది.. అది ఎప్పుడు ఎలా వచ్చిపడుతుందో ఎవడికీ తెలియదు. అదే అసలు సమస్య.

ఎంతో కష్టపడి.. సాధించాం అనుకున్న పని.. మన పైన ఉన్నవాడికి డెమోనో లేక సబ్మిట్ చేద్దామనో అనుకున్నప్పుడు.. సడెన్ గా మొరాయించడం మొదలవుతుంది.. దాన్నే బగ్ అనో.. గిగ్ అనో.. మా ప్రోజెక్ట్ లీడర్ అయిరన్ లెగ్.. అనో ఏదనుకున్నా కానీ.... ఒకొక్కసారి. చేసినదంతా వేస్ట్ అన్నట్లు ప్రోజక్ట్ లీడర్.. మొహంమీద.. కరాకండిగా చెప్పేస్తాడు ఇంత సులువుది కూడా ఇంత టైం తీసుకుంటున్నావేంటి అని ఇన్ డైరెక్టుగా అడుగుతాడు.. ఇక ఒక్కసారే మీటర్ 200 దాటిపోద్ది.. పోరా.. నీకు తెలియనిదా.. ఇది.. నేనంతా కరెక్ట్ గానే చేసాను.. అది ఈ ఇష్యూలో చిక్కుకుంది నేనేంచేయను. నా సీట్లో కూర్చుంటేగాని తెలియదు.. చేసేముందు నాకూ ఈజినే అనిపిస్తుంది.. కాని ఈ అనుకోని సమస్యల్లో చిక్కుకుని.. ఇలా అయ్యింది.. ఒక్కసారి చేసిచూడు తెలుస్తుంది.. అని మనసులో… అనుకుని.. కాస్త చిరాకు పరాకు చూపులు చూసే సరికి వాడికే అర్ధం అవుతుంది..

అదికాదమ్మా.. ఇది నీ ప్రాబ్లమ్ కాదులే.. నువ్వు చెయ్యాలని చెయ్యలేదనుకో కాని.. ఇప్పుడు డెలివరి టైం లో ఇలా వస్తే నామీద ఎగిరి పడతారు.. అందరూ.. ఇప్పుడెలా.. అని బిక్కమొహం వేస్తాడు... ప్రోజక్ట్ లీడరు..

సరేలేండి ఐవిల్ గూగుల్ ఇట్ అవుట్…(గూగుల్ లో వెతికి చూస్తాను) అది నోన్ ఇష్యూ అయితే.. ఫోరమ్స్ లో సొల్యూషన్ దొరక్కపోదు.. లేకపోతే కొన్నిరోజులు వెయిట్ చేయాలి.. అని.. కాస్త కుదుట పడి..

మళ్ళా.. అలో.. సాఫ్ట్వేర్.. ఇంజనీర్.. అనుకుంటూ.. మొహాన్నీ మానిటర్ కి వేళాడదీసుకోవాల్సొస్తుంది. ఈ లోపుగా.. ఎవడో టైముబాగోక మెయిలో.. లేక ఫోనో చేస్తాడు.. అంతే వాడికి మూడింది.. ఎరా.. ఏం పీకుతున్నవ్ బే.. ఈ మధ్య ఫోన్ చేయటంలేదు.. పోరీని పట్టావేంటి.. అంటాడు.. నేను సాయంత్రం చేస్తారా.. అని ఎక్కిన మీటర్ ని.. దించి.. కళ్ళుమూసుకుని.. కూల్ గా చెబుతాను .. విన్నాడా బ్రతికిపోతాడు. లేకపోతే అయిపోతాడు..

మళ్ళీ వర్క్.. ఈలోపు.. కాళీగా తిరిగే ప్రక్క ప్రాజెక్ట్ వాళ్ళ వెటకారాలు.. (మనం ఖాలిగా ఉన్నప్పుడు తగ్గుతామా.. ఏంటి.. మనమూ ఇలా సెటైర్లేస్తాం.. అందుకే వీళ్ళ రివెంజ్ ఇప్పుడు.)

మనోడు కుమ్మేస్తున్నాడురో.. హైకుల టైముకదా.. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ కోసమేమో, లేదా ఆన్ సైట్ ఆఫర్ కోసమో.. సీరియస్ గా చేస్తున్నాడు.. అని సెటైర్లు వేయటం..

ఒరే.. పనీలేదు పాటూలేదు.. మెడకో లాప్ టాప్ అని..

ఇక్కడ పని అవక నేను చస్తుంటే.. ఆన్ సైట్ ఆఫర్ ఒకటి… అనేలోపే.. వాళ్ళు తప్పించుకుని నవ్వుతూ పారిపోయారు..
సడెన్ గా ఎదో.. మనకు దగ్గరగా ఉన్నటువంటి సమస్యే.. ఎవడో ఫోరమ్లో కనిపిస్తుంది.. కళ్ళింతచేసి మొహం మానిటర్లోపెట్టి వెతికినంతసేపుండదు.. దానికి ప్రశ్న ఉంది కానీ జవాబు ఎవరూ ఇవ్వలేదు....

ఛీ.. నీ.. కొంచెంలో పోయిందిరా.. అనుకుని.. వీడు ఎవడో మనలాంటి బాద్యుడే.. అనుకుని.. మళ్ళీ.. వెతుకులాట.

అంతే ఈలోపు.. డెస్క్ పై ఉన్న ఫోను మ్రోగడం మొదలుపెడుతుంది.. నాకు తెలియనంత ధీక్షగా వెతుకుతున్నానేమో.. అప్పటికే పది రింగులై ఉంటాయి.. మొద్దుబారిన మెదడుకు ఎదో మ్రోగుతున్నదని.. అనిపించి.. లిఫ్ట్ చేసానా.. సార్... వి ఆర్ ఫ్రమ్.. సో అండ్ సో బ్యాంకు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ క్రెడిట్ కార్డు వాడుతున్నారు.. సార్.. అని శ్రావ్యంగా.. వినపడిందొక ఆడగొంతు.

నీకు బుద్దుందా.. నేనేది వాడితే నీకెందుకే.. పెట్టు ఫోను.. మళ్ళీ చేసావంటే.. నిన్ను.. నిన్ను.. ఛా.. అని.. టక్ మని.. ఫోన్ పెట్టేసాకా అనిపిస్తుంది.. పాపం ఈ టాస్క్ మీద కోపానికి ఆ అమ్మాయి భలి.. లేకపోతే నేను ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే కాసేపు కాలక్షేపానికి సుత్తికొట్టేవాడిని కదా.. ఇలాంటి టైములో ఏంటి.. అని అనుకుని.. సరేలే.. ఆ అమ్మాయి టైము బ్యాడ్.. కష్టమైన టాస్క్ చెయ్యలేని.. ఎవడో ఎదవ.. కష్టమర్.. అని లైట్ తీసుకుంటుందిలే...


ఆమ్మా.. గూగులమ్మతల్లీ.. ఈ బ్రహ్మీ సాప్ట్వేర్ ఇంజనీరుకు.. సొల్యూషన్ వరాలిచ్చి కరుణించమ్మా.. ..

త్వమేవ మాతాచ పితాత్వమేవ.. త్వమేవ భందు సఖాత్వమేవ….. త్వమేవ సర్వం మమదేవదేవా… అని పెద్ద శ్లోకం చదివి.... హారతిచ్చి.. కొబ్బరికాయ కొట్టినట్లు..మళ్ళీ.. వెతుకు.. బటన్ కొట్టాను. గూగుల్ లో..

ఈ లోపు.. నాలుగుసార్లు ప్రోజక్ట్ లీడర్ వెనుకనుండి తొంగిచూసి వెళ్ళాడు..

ఆయన టెన్సన్ ఆయనది.. అసలు దొరుకుతుందో లేదో అని నాకు టెన్సనైతే.. ఏమో అసలు అవుతుందో లేదో అని.. (అతని చేతిలో లేదు కదా) అతని టెన్సన్..

మళ్ళీ ఏసీలో చెమటలు.. కాసేపటికి ఒక కొలిక్కి వచ్చింది.. అనిపించింది.. ఎదో పాత గుడ్డకి పాత దారం వేసి కుట్టిన.. అతుకుల బొంత లాగా…

టైముచూసేటప్పటికి.. పదయ్యింది.. ఏంటి.. అప్పుడే పదా.. అమ్మో వెళ్ళాలి.. అనుకుని వెనక్కి చూసేటప్పటికి.. పీయల్ జంప్..

హమ్మయ్యా అనుకుని పిల్లిలా నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరుకుని.. ఊపిరిపీల్చుకున్నామా.. తిన్నామా.. పడుకున్నామా..

ఇక రాత్రంతా కలలో ఫర్ లూప్ లు.. వైల్ లూపులు.. ఇన్ఫైనేట్ లూపులో పడి కొట్టుకున్న ప్రోగ్రాములు. బాబోయ్.. అలా కలతనిద్రతోనే తెల్లారుతుంది... పొద్దున పదయ్యింది కూడా.. పరుగుపరుగున స్నానం.. టిఫిన్ మళ్ళీ జైలుగదిలోకి వెళ్ళినట్టుగా ఆఫీసులోకి ఎంటరవుతున్నప్పుడు ఫీలింగు..

పీయల్ వచ్చే టైమయ్యింది.. ఎలాగోలా నే చేసింది చూపించి.. కన్విన్స్ చేయాలి.. అని.. పైనుంచి కిందకు.. అటునుండి ఇటు.. నాలుగు సార్లు టెస్ట్ చేసి చూసుకున్నాను.. బాగానే పనిచేస్తుందనిపించింది..

అలా వెళ్ళి ఆ పౌడర్ టీ ఒకటి తాగుదాం అని వెళ్ళాను.. కిటికీలోంచి బయట ఎండను చూస్తూ.. వేడివేడి టీ.. ఏసిలో తాగుతుంటే.. బాగుంది అనిపించింది. కాసేపు టైమ్ పాస్ చేస్తుండగా.. అప్పుడే వస్తున్న కొలీగ్స్ తో కాసేపు పిచ్చాపాటి మాటలు… ఎవడెవడు.. కంపెనీలు మారాడో.. ఎంతెంత వస్తున్నాయో… లాంటి విషయాలు విని.. ఆశ్చర్యంతో నోరుతెరిచే టీ త్రాగుతున్నాం అందరూ….

ఒరే.. తెలుసా.. ఆ వెంకట్ గాడు ఆన్ సైట్ పోయాడు.. జాయిన్ అయ్యి పదిరోజులు కాలేదు.. కొత్తకంపెనీలో.. అప్పుడే ఎగిరిపోయాడ్రా అన్నాడు మా కొలీగ్. నిజంగా..?? చాలా లక్ రా..!!, అన్నా నేను..

కాదు..రా లక్ కాదు.. సుడి.. వాడికి లక్ ఎక్కడుంది..? మొన్నటివరకూ ఏ కంపెనీలోనూ సెట్ కాలేక.. వర్క్ ఇస్తే చాలు జంప్ చేసే వాడికి.. సడెన్ గా వచ్చింది…ఈ ఆఫర్.. అయినా తెలిసిందేంటంటే.. వాళ్ళ ప్రోజక్ట్ లో మెదటి వ్యక్తి వీడేనంట.. స్టడీ చెయ్యాలని పంపించారు వీడిని.. ఇంకా టీమ్ ఫామ్ అవలేదంట..లే.. అని.. తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు.. (అలాగే అందరి మనసులకి సర్దిచెప్పాడు.. లేకపోతే.. అదొక నిద్రపట్టని భాధ...),

ఒరే.. మనమెప్పుడు ఎగిరిపోయి.. హాయిగా బ్రెడ్ జామ్ తింటూ.. డాలర్స్ ఎప్పుడు సంపాదిస్తాంరా.. అన్నాడింకొకడు..

కంగారు పడకులే.. వెళ్తావు.. నువ్వే ముందు.. వెళతావు.. మాలో అన్నానేను..

ఇదింకా బాగుంది.. రా... ప్రాజెక్టూలేదూ.. పనీలేదూ.. అన్ సైటు ఆఫరన్నాడంట వెనకటికి నీలాంటి వాడొకడు..

నేను ఈ బెంచి పై నవమాసాలు నిండి.. పురిటినొప్పులు పడలేక చస్తుంటె..నేనెలా వెళ్తానురా.. అన్నాడు చిరాగ్గా.. అంతా నవ్వుకున్నాం.

నేను టైముచూసుకుని.. ఒరే..మా పియల్ వచ్చే టైమయ్యిందిరా. అని.. మళ్ళీ జైలుగదిలోకి ఎంటరయ్యాను..

నా టైమ్ స్టార్ట్ అన్నట్లు టెన్సన్ గా ఊపిరి బిగపట్టి.. చెబుతున్నాను.. ఇలా ట్రై చేసాను.. ఇది రిజల్ట్.. అని..

ఓ గ్రేట్ జాబ్.. బడ్డీ.. మరి.. దీనివల్ల ఇలా అవ్వచ్చేమో టెస్ట్ చేసావా.. అని అన్నాడు పీయల్..
చూసానండి.. అది కూడా ఒకే.. నౌ ఉయ్ కెన్ కన్విన్స్… నో ఇష్యూస్.. అనుకుంటున్నా.. అన్ని రకాలుగా ఇదే బెస్ట్ సొల్యూషన్ అని నా అభిప్రాయం… అని ఫైనలైజ్ చేసేసాను..
ఒకే.. లెట్ అజ్ ట్రై.. ఇంకొక విషయం ఎంటంటే.. మొన్న మనం ఇచ్చిన సొల్యూషన్ కే.. క్లైంట్ ఒప్పుకున్నట్లు మెయిల్ ఇచ్చాడు.. ఈ రోజు పొద్దున్నే చూసాను.. నీకు ఫార్వార్డ్ కొట్టడం మరిచిపోయాను.. శ్రీ.. ఇక ఈ సొల్యూషన్ అవసరంలేదు.. అని ఇన్ డైరెక్టుగా.. చెప్పాడు.. పీయల్..

నా కళ్ళలోకి ధైర్యంగా చూడలేక.. ప్రక్క చూపులు చూస్తూ.. సరే.. కొత్త ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో.. చూడండి.. అని.. మాటమార్చేసి.. వెళ్ళిపోయాడు.. చల్లగా..

ఒక్కసారి.. దిమ్మతిరిగిపోయింది.. ఇన్ని రోజులు రాత్రిపగలు కష్టపడి టెన్సన్లు పడి..
రాత్రిళ్ళు.. నిద్రలేకుండా.. ఫ్రండ్స్ అందిరిమీదా.. చిరాకుపడి.. ఫోన్లుచేసిన శ్రావ్యమైన అమ్మాయిల గొంతుని కసురుకొన.. అయ్యో పాపం కసురుకున్నానే.. అని బాధతో (పౌడర్ టీ..) తాగి..తాగి ఆరోగ్యాలు పాడుచేసుకుని.. ఇంతా.. చేస్తే... ఆ క్లైంటుగాడు.. మెడమెంటలోడుకాకపోతే.. సగం ఉన్నది నచ్చిందా.. వాడికి

నచ్చితె నచ్చింది… పోనీ.. అది నచ్చి చచ్చింది అని.. ఈ ఎధవ చెప్పొచ్చుకదా.. ఇంతలా టెన్సన్ తో చస్తుంటే.. మెయిలుచూడకుండా గేమ్స్ ఆడతాడా.. ఇప్పుడొచ్చి చల్లగా.. అవసరంలేదని ఒక్కమాటలో చెప్తాడా..

సంభంధంలేని.. చదువులు చదివి.. సెలెక్ట్ అయిపోయాం కదా.. మంచి జీతం అని ఉద్యోగాల్లో చేరటం.. ఆన్ సైట్ ఆఫర్ కొట్టడం.. తిరిగొచ్చి.. లీడ్ పోస్ట్ కొట్టేసి.. ఇలా మెయిల్లు చూసుకోకుండా మా ఖర్మకొద్దీ.. తయారవుతారయ్యా.. అని.. కాస్త కసిగా తిట్టేసుకున్నా మొత్తం సీనియర్ స్టాఫ్ అంతటిని..

ఇంకా ఏమనాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు.. (ఇలాంటి కొత్త కొత్త నటనలు రియాక్షన్ లు.. చాలా అలవాటవుతాయిలేండి.).. ఫస్ట్ ఆఫ్ లో ఫోలీసుగా ఉండి.. సెకెండ్ ఆఫ్ లో దొంగలామారిపోయి.. జరిగే.. చెల్లిపెళ్ళిని దూరంగా చూస్తూ గోడను.. ఒకచేత్తో భలంగా నొక్కుతూ.. పట్టుకుని.. ఏడుస్తున్న సూపర్ స్టార్ కృష్ణ సీన్ గుర్తొచ్చి.. అదే మొహంపెట్టి.. అదే.. రియాక్షన్ పెట్టి.. కాసేపు బాధపడ్డాను..

చీ ఈ సాప్ట్వేర్ ఉద్యోగం కన్నా.. ఏదైనా పార్క్ లో ఐస్క్రీమ్ లు.. అమ్ముకోవటం బెస్ట్ రా బాబు సాయంత్రానికి.. ఎంత సాధించామో.. సంపాదించామో.. తెలుసుకోవచ్చు... ఎవడూ.. నాకీ ఐస్క్రీమ్ నచ్చలేదని.. సగం తిని తిరిగి ఇవ్వడు అని.. కూడా అనుకున్నాను.. మళ్ళీ బాధలో ఒక పెగ్గు పౌడర్ టీ… ష్.. బాధొచ్చినా సంతోషమొచ్చినా అదేకదా మాకు… మందు..

ఇలాంటి తలతిక్క పనులుచేయబట్టే.. అందరూ సాఫ్ట్వేర్ అంటే నవ్వుతున్నారు.. నవ్వరా మరి.. ఒక క్షణం బిజీ.. ఒకక్షణం ఖాలీ.. అంటే.. ఎవడికి నమ్మబుధ్ధి అవుతుంది..

ఇంతలో.. ఇంటినుండి ఫోను.. ఏరా.. బాగున్నావా.. ? అసలు ఫోను చేయటంలేదు.. ఆరోగ్యం ఎలా ఉంది.. అని అమ్మో నాన్నో ఆరా అడుగుతారు.. కాస్త నవ్వు తెచ్చుకుని.. బాగానే ఉన్నాను.. కాస్త బిజీగా ఉన్నా అందుకే చెయ్యలేదు.. మీరెలా ఉన్నారు.. అందరూ ఎలా ఉన్నారు.. అని కాసేపు.. ఎవో కబుర్లుచెప్పాకా..

మా దగ్గరేముంటాయిరా.. మీరే చెప్పాలి.. ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అని అనగానే.. మా బ్రతుకులే చెప్పుకోవాలి అని అనాలనిపిస్తుంది... కానీ మన టెన్సన్స్ అన్నీ ఇంట్లో చెప్పటమెందుకులే అని.. ఏమున్నాయి.. తిన్నామా.. ఆఫీసుకు వెళ్ళామా.. పడుకున్నామా అంతే.. అలా నడిచిపోతున్నాయి రోజులు. బాగానే ఉంది అంతా అని చెబుతాం..ఇక ఎవరన్నా ఫ్రండ్స్ ని కలిసినప్పుడు.. మాటల్లో.. వస్తే.. నీకేంట్రా సాఫ్ట్వేర్ ఇంజనీరువి.. అనేమాటలే.. కాస్త వెటకారంగా అనిపిస్తుంటుంది...

ఇక తరువాత వారం రోజులు ఖాలీ.. తిండి.. చాటింగ్.. ఆర్కుటింగ్.. పడక అదే పని.. కళ్ళార్పకుండా.. సీరియస్ గా ఆర్కుట్లో.. రాబోయే స్ర్కాపుకోసం వెయిటింగ్…వచ్చిన స్ర్కాపుకి.. జవాబిస్తూ మళ్ళా ప్రక్కనున్న యాహూ. మెసెంజర్.. మెసెజ్ విండోలో ఎదో టైపుచేసి.. నాలో నేనే పిచ్చోడిలా నవ్వుకోవటం..

సరే టీ తాగుదాం అని (ఇప్పటికి ముప్పయ్యోది అనుకుంట గుర్తులేదు.. ) లేచానా.. అంతే.. ఎదురుగా ఉన్న డెస్క్ పై అమ్మాయి.. మానిటర్ వైపు చూస్తున్నట్లే కూర్చుని నిద్ర..

అబ్బబ్బా.. పొద్దున్నే ఈ నిద్రమొహాలేంట్రా బాబు.. ఆఫీసులో.. పనిలేని టైములోకూడా ఇలా నిద్రపోతుంటే.. ఏంబాగుపడతారు.. అసలీ ఆడవాళ్ళకెందుకంటావ్.. ఎందుకులే.. మళ్ళా మహిళా సంఘాలన్నీ నన్ను నిలదీసేస్తాయి.. అంటే అన్నామని.. మనకెందుకులే.. అని బయటకు పోయాను..

సరిగ్గా పదిరోజుల తరువాత మళ్ళా కొత్త ఇష్యూ అని చెప్పి.. ఎక్సెల్ షీట్ ఇచ్చారు.. ఈసారైనా.. సీరియస్ గా చెయ్యాలి. మాటపడకూడదు.. అని.. మొదలుపెట్టాను.. వచ్చిన మంచి గుడ్ మార్నింగ్ మెయిల్స్ చదువుతూ.. కాస్త ఇన్స్పిరెషన్ తెచ్చుకుని.. చాలా కష్టపడి.. ఒక్కదెబ్బకు రెండు స్ర్కీనులు లాగా.. రెండు అవగొట్టాను..

కాసేపటికి.. అప్లికేషన్ రన్ చేసి చూసాను.. అనుకోకుండా.. ఎర్రర్స్.. మళ్ళా.. ఎదో. పీకనొక్కేసినట్టు.. అయిపోయింది.. ఎంటిరా.. ఒక సెకను ముందు పనిచేసింది.. ఏమైంది.. దీనికి.. అని ఒక పావుగంట బుర్రపీక్కున్నాకా.. గమనించాను.. డేటాబేస్ లో ప్రోబ్లమ్ అని.. డేటాబేస్ వాడి దగ్గరకెళ్ళి.. ఫలానా టేబుల్ లో ఎర్రర్ వస్తుందేంటి.. అని అడిగాను..

హి హి హి.. అదా.. రాదేంటి మరి.. దాంట్లో నాలుగు కాలమ్స్ డిలీట్ చేసేసేగా.. అని చల్లగా చెప్పాడు..

కొత్త చేంజెస్ వచ్చాయి.. అవి చేస్తున్నాను.. అని వెటకారంగా చూసాడు..

మరి చెప్పాలిగా అన్నట్లు.. చూసాను.. చెబుతామండి.. చేసాకా.. అన్నట్లు చూసాడు..

వా…. ఓరి దేవుడో.. నన్ను రక్షించు.. అని సీలింగ్ వైవు చూసి.. పెద్దగా గావుకేకపెట్టాను.. ఎవరికీ వినపడకుండా….

రోజులు గడిచాయి… మా అక్కవాళ్ళ అమ్మాయి.. ఫోన్ చేసింది.. మావయ్యా.. రేపు శనివారం నా పుట్టినరోజు.. వస్తున్నావా? అని.. అడిగింది.. అవునా..? మర్చిపోయాను..!! అని కాకుండా కవర్ చేసుకుని.. తెలుసమ్మా.. కానీ రావటం కుదరదు.. డెలివరీ ఉంది.. అన్నాను..

ఎవరిది.. మావయ్యా..?? అంది.. (నాదే.. వర్కు…ఎక్కవై.. అని మనసులో అనుకున్నాకా..)
హ.. హా…హా.. (నవ్వలేక నవ్వాను..) ప్రోజెక్ట్.. లాస్ట్ లో ఉంది.. బిజీ అని చెబుతున్నానమ్మా అని అన్నాను.

ఎలాగైతే.. డెలివరీ చేసేసాం.. హమ్మయ్యా.. అనుకున్నాం.. తరువాత రోజు ఆఫీసుకు మంచి హుషారుగా వచ్చారంతా.. ఆ రోజు శుక్రవారం ఒకటేమో.. మొత్తం ఊళ్ళో ఉన్న దుకాణాల్లో ఏది.. కాస్త కొట్టొచ్చినట్టు..(చెత్తగా) కనిపిస్తుందో కనుక్కుని మరీ కొన్నట్లు.. ఉండే టీ షర్ట్స్.. కార్గోస్.. వేసుకొచ్చి.. కళకళలాడిపోయింది ఆఫీసంతా..

రిషెప్సనిస్ట్.. ఏ లిప్ కలర్ వేసుకొస్తుందో అని కాసేపు డిష్కషన్ జరిగింది.. కానీ మేమనుకున్న రంగుకాకుండా.. వేరేది వేసుకొచ్చింది మళ్ళీ.. అన్ని రంగులు తయారు చేసినోడికి కాదు కానీ.. అన్నీ కొని వాడుతున్నందుకు ఇవ్వాలి ఈ అమ్మాయికి అవార్డు.. అనిపించింది..

ఎప్పడూ ఏదోక సెస్నేషన్ వార్త పట్టుకొచ్చే.. సత్తిగాడు ఇంకా రాలేదేంట్రా అన్నానో లేదో.. వెనుకనుండి.. వచ్చేసాడు.. ఇక్కడే ఉన్నా అని మంచినీళ్ళు త్రాగుతూ.. గుటకలువేస్తూ..

ఓహో.. నువ్వు త్రాగటంలో బిజీనా.. రాలేదేమో అనుకున్నా నీ మాట వినపడేసరికి అని అంతా నవ్వుకున్నాం..

సత్తి: మీకో విషయం తెలుసా.. మన పీయమ్ రిజైన్ చెయ్యబోతున్నాడంట..
మేమంతా: నిజమా.. ఎందుకు?
సత్తి: నలుగురిని ఫైర్ చేసారంట.. ఐదో ప్లోర్ లో.. తెలుసా?
మేమంతా: కారణం ఏంటి?

ఇలా మొదలుపెట్టాడు.. టివి9 హెడ్ లైన్స్ లా.. కేప్షన్ తో సహా చెప్పాడు.. కానీ జవాబులు చెప్పడు వాడికలవాటే..

కానీ వాడు చెప్పే వార్తలకు.. ఎవడైనా కంగారు పడకుండా ఉండగలరంటే.. పొరపాటే..

తరువాత ఒక్క మంచి వార్త మాత్రం చెప్పాడు.. మనకు అబ్బాయి పుట్టాడంట… ప్రోజెక్ట్.. సక్సెస్ గా డెలివరీ అయ్యిందంట.. అని..

హమ్మయ్యా.. బ్రతికించావురా దేవుడా అనుకున్నాం టీమ్ మెంబర్స్ అంతా..

సరే పార్టీరా ఈ రోజు.. అని వేరే టీమ్ వాళ్ళు గ్లాసులు పట్టుకుని రడీ అయిపోసాగారు.. చూద్దాంలే అని.. మాట దాటేసాం..

డెస్క్ దగ్గరకెళ్ళి మెయిల్ చెక్ చేసుకోగానే.. మొదలుపెట్టాడు సత్తిగాడు.. పెద్దకేక పెట్టి.. ఒరే.. బగ్ లిస్ట్ పంపార్రోయ్… అని..

అబ్బాయే.. పుట్టాడు.. అచ్చు.. సత్తిగాడిలా ఉంటాడు… అని నేను పాడగా..
బాబోయ్ వద్దురా.. అమ్మాయే.. పుడుతుంది.. అచ్చు.. శీనుగాడిలా ఉంటుంది.. అని అన్నాడు..

హ హ హా.. హా.. అని పగలబడి నవ్వుకున్నామిద్దరూ...

(కొంపదీసి నా మోడ్యూల్ లోనే వచ్చుంటాయి.. దేవుడా.. అదే కోడ్..(నేను రాసిందే నేను) మళ్ళీ.. చదవాలంటే నరకం.. )

44 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పౌడర్ టీ అంటే ఏమిటి?

ఆసా చెప్పారు...

పీత బాధలు పీతవి. మన సాప్ట్ పీతల జీవనశైలిని వున్నదున్నట్టుగా మంచి హాస్యం జోడించి వ్రాసారు..
హాయిగా నవ్వుకొన్నాము.
విషయం ఏమిటంటే ఎవరి పరిధిలో వాళ్ళ బాధలు వుంటాయనిపిస్తుంది తీసుకొనే వాడికి..
కొంత మంది అయితే నాకేంటి అన్నట్టు వుంటారు (ప్రొఫషనల్ అని ఒక బోడి కవరింగ్ తో) వాళ్ళు ఎక్కడ వున్న ( ప్రోగ్రామర్ /పియల్ ) బాధలు ప్రక్క వాడికే..
మీ రచనా శైలి బావుంది.

maa godavari చెప్పారు...

raaju garu
maadi west godavarenandi.mee post bavindi.mee parichayam bavundi .

Sudhakar చెప్పారు...

ఇరగదీసారు..మీ డిఫెక్ట్ డెన్సిటీ చల్లగా వుండుగాక !

రానారె చెప్పారు...

"అమ్మా గూగులమ్మతల్లీ" అని గూగుల్ ని గంగమ్మతల్లిలాంటి గ్రామదేవతగా చేశారు... నాకు నవ్వాగలేదు. చాలా నిజాలున్నాయి ఇందులో, తమాషాగానే.

Unknown చెప్పారు...

ఉన్న నిజాలే...
సాఫ్ట్‌వేర్ జీవితం అంటే నల్లేరు మీద నడక అనే అందరూ అనుకుంటారు మరి.

leo చెప్పారు...

hilarious and yet so true.

అజ్ఞాత చెప్పారు...

Its very nice.. Keep it up

Unknown చెప్పారు...

Chala baga vundi. Andariki roju alavatu ayina chadivite kani teliyadu manam e paristitilo vunnamu ani. Anyways good job done.

Unknown చెప్పారు...

చాలా బాగుందండీ శ్రీనివాస్ గారు. మన సాఫ్ట్ వేర్ జీవితాల గురించి చాలా బాగా రాసారు. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా కూలీపని చేసుకునే వాళ్ళే నయం, ప్రొద్దునంతా శ్రమ పడి రాత్రి సుఖంగా నిద్రపోతారు. మన దగ్గర అన్నివుంటాయి, మనవాళ్ళు తప్ప.

V.A.R Chowdary చెప్పారు...

Brammi Software Engineer !!!!,Good Comedy,real life of Software engineesrs!Great Raju garu

Regards,

Unknown చెప్పారు...

Hi RajuGaru,
Meeku Director or Writer Manchi Bavishyattu(Future) undi .....Future lo Cinemallu Teeyavachu..


With Regards
Bhaskar Rao.M

Unknown చెప్పారు...

Raju gaaru,
s/w life chaala sahajamugaa varnincharu...aasaantham aanandincha...mee ninchi elanti rachanalu ennoravalani aasisthu

Siva,
oka brahmi, blore

అజ్ఞాత చెప్పారు...

chala bagundhi srinivas garu

బ్లాగాగ్ని చెప్పారు...

చాలా బాగుంది మాష్టారూ. చక్కటి శైలిలో సాఫ్ట్ బాధలని వర్ణించారు. ఇంకా ఇలాంటివెన్నో మీనుంచి రావాలని ఆశిస్తూ...

అజ్ఞాత చెప్పారు...

good andi. s/w lo vunna kooda theliyani vishayalu konni chepparu. Ee abbayilu yekkada vunna yentha develop aina ammayilni vekkirinchatam mathram podu. (Receptionist gurinchi mee comment)

అజ్ఞాత చెప్పారు...

Nee article chaala bagundi. maa collegues andaru chadivari. Roju maa discussion unde sangatanalanni unnayi. so mana software engineer jeevitalanni okela untayi, adi e company aina, e work aina.

Vamshi K చెప్పారు...

Adaraho !

Naren Kondavaty చెప్పారు...

ఇరగ దీసావు బాబాయ్! మన సాప్ట్వ్ ర్ ఇంజినీర్ భాధలు చక్కగ వివరించావు. కాని అనుభవించిన వాడికే అర్ధము అవుతుంది.

Naren Kondavaty చెప్పారు...

ఇరగ దీసావు బాబాయ్! మన సాప్ట్వ్ ర్ ఇంజినీర్ భాధలు చక్కగ వివరించావు. కాని అనుభవించిన వాడికే అర్ధము అవుతుంది.

Ganapathi rao K చెప్పారు...

అదిరింది మాస్టారు ....
చాలా బాగుంది మాష్టారూ....
మోసేవాడికే తెలుస్తుంది కావిడ బరువు అని... బాగాచెప్పారు
గూగుల్ ని "గూగులమ్మతల్లీ" తో బాగా పోలిచ్చి చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...

Hilarious!!
eager to read the upcoming..
the cenematic fun is added to the realistic life so deftly..
I was just in merry through out.. downplaying girls is just an exception though.

శ్రీ చెప్పారు...

భలే రాసారండీ రాజు గారు!

త్రివిక్రమ్ Trivikram చెప్పారు...

భలే రాసినారండీ. నవ్వు ఆపుకోలేకపోయినాను.

శ్రీనివాసరాజు చెప్పారు...

అమ్మాయిల్ని ఉద్దేశించి వ్రాయడం ఉద్దేశ్యం కాదు.. జనరల్ గా అబ్బాయిలు అంతా అలా మాట్లాడుకంటారేమో తెలియదు కానీ.. కొన్ని సార్లు మా బ్యాచ్ అలానె మాట్లాడుకుంటాం. సైలెంట్ గా తనపని తాను చేసుకుపోయే అమ్మాయిని కామెంట్ చెస్తే తప్పుకానీ.. కావాలని.. కటింగులిచ్చే.. అమ్మాయిలు.. కామెంట్సే.. వాళ్ళకు.. కాంప్లిమెంట్స్.. తప్పుగా వ్రాసుంటే క్షమించండి.. నేచురాలిటీ కోసం వ్రాయక తప్పలేదని.. చెప్పాను..

అందుకె.. ముందే. చెప్పానుగా.. :(

అజ్ఞాత చెప్పారు...

article baagundi. gaani koncham length ekkuva ayyindemo anipinchindi..

Srimanasa చెప్పారు...

Bhalee gaa undandii :). Chaala baaga vraasaru .

Unknown చెప్పారు...

Hi srinivas gaaru,chaalaa baagaa raasaru.Mee padamati godavari raagam,guugulamma thally,powder tea............Mana software job lo unna kastaalani chaala baaga chepparu.inthaky meeku(mee projectki) final gaa abbayi puttadaaa?leka ammayi puttindhaaa?chaala jovial gaa undhi.navvy navvy kadupu noppi vatchhindhandy.gud job:)

Indooooooooo చెప్పారు...

nice article.. but plzz mee kopam mee wife meeda chupinchakandi..

Unknown చెప్పారు...

bagundi

అజ్ఞాత చెప్పారు...

Really Superb.

Kaani Software feild loki enter avvali anukunna vallu mathram bhayapadatharemo nandi.

Any way's good fun in reading.

అజ్ఞాత చెప్పారు...

Venkat Unnam

Hello srinivas gaaru, mimmalni mee TL, PL & PM chaala baaga vadukunnarani maaku baaga arthaminaadi. Software employee life cycle chaala baaga varnincharu. Naaku telisi idi new generation ki good news. Endukante narakaanni current generation s/w employees ki telusukaabatti.

Rajendra Devarapalli చెప్పారు...

పనిలేని టైములోకూడా ఇలా నిద్రపోతుంటే.. ఏంబాగుపడతారు.. అయ్యా ఎంత విసిగిపోయారో ఎంత పరిశీలిస్తున్నారో ఇంతకు ముందు కొన్నిసార్లు విన్నాము కానీ ఇలా విశదీకరించి రాసింది మీరే మొదట అందుకోండి వీరతాళ్ళు మూడు.

Sumanth చెప్పారు...

It is very good. u r showing real brahmii life.
Ganesh.

oremuna చెప్పారు...

This came to as a mail forward now to me!


BTW nice one!

Mani Kanaka Raju Kunda చెప్పారు...

Kummav baasu!!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మాస్టారూ..మీరొక సినిమా తీసెయ్యోచ్చు మీ సాఫ్ట్వేర్ టపాలన్నీ జోడించి...చాలా బాగా రాస్తున్నారు...

శ్రీనివాసరాజు చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు గారు
సినిమా తియ్యటానికి నేను రెడిగానే వున్ననండీ.. నిర్మాతలే కొరత..
మీరేమన్నా ఫైనాన్సియర్ భరత్ షాలాగా.. కే. సెరా సెరా లాగా ఎమన్నా ఫైనాన్స్ చేస్తారేంటి?? చేసే ఉద్దేశ్యంవుంటే చూడండి.. అయితే నిండా మునుగుతాం.. లేకపోతే ఒడ్డునపడతాం.. ఎన్నాళ్ళని ఈ ఇండస్ట్రీలో ఈదుతాం చెప్పండి.. :-)

స్వామి ( కేశవ ) చెప్పారు...

అంటే .. మీ నుంచి " బ్రహ్మీసాఫ్త్వేర్ ఇంజినీర్" లానే , "శ్రీను ..థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ" అనే టపా కూడా చూడొచ్చు అయితే ..!

:-)

శ్రీనివాసరాజు చెప్పారు...

@నీకోసమే నా అన్వేషణ గారు
ఇంకా అంత ఎక్స్పీరియన్సు రాలేదండీ.. నిండా ఏడేళ్ళు లేవు ఇండస్ట్రీలో. టపా రాయటానికైతే ఎక్స్పీరియన్సు అవసరంలేదు అనుకోండి. చూసిన అనుభవాలు సరిపోతాయి. తప్పకుండా రాస్తాను. :-)

RamyaKandrika చెప్పారు...

mi blog designing n presentation bavundi fullpledge telugu blog , mi writing style kuda bavundi pls keep go on. oka software engineer lo intha art ante its a gods gift gud to c like that.

శ్రీనివాసరాజు చెప్పారు...

@రమ్య గారు
మీ కామెంటుకు ధన్యవాదములు.
నా బ్లాగు, రచనలు నచ్చినందుకు సంతోషంగా వుంది.
:-)

Kondalarao Thota చెప్పారు...

నిజమే సగం ఐస్క్రీమ్ తిని బాగా లేదని తిరిగి ఇవ్వడు కదా...! 13 సంవత్సరాల క్రితమే మీ సాఫ్ట్వేర్ బాధలను మాకు బోధపడేలా చెప్పారు.

Kondalarao Thota చెప్పారు...

నిజమే సగం ఐస్క్రీమ్ తిని బాగా లేదని తిరిగి ఇవ్వడు కదా...! 13 సంవత్సరాల క్రితమే మీ సాఫ్ట్వేర్ బాధలను మాకు బోధపడేలా చెప్పారు.

Related Posts Plugin for WordPress, Blogger...