ఒక కవిత/పాట
మొన్న రోడ్డుపై అలా సడుస్తూ వెళుతుంటే నాకొక పేపరు దొరికింది. ఎవరో వ్రాసుకున్న పాటో/కవితో మరి. కాస్త బాగుంది అనిపిస్తే ఇక్కడ వ్రాస్తున్నా.
ఒక బ్యాచిలర్ అబ్బాయి, చుట్టూ అందరూ జంటలుగా తిరగడం చూసి , మనసురగిలి వ్రాసుకున్న ఒక కవితలా నాకు అనిపించింది , అనుమానం లేదు.. మీరే చదివి చెప్పండి ఏమనిపించిందో మీకు.
-----------------------------------------------------
పట్టణాలలో పల్లెటూర్లలో
బట్టబయలునా పార్కుల్లోనా
ధియేటర్లలో బీచ్ లలోనా
డిస్కోల్లోనా పబ్బులవెంటా
ప్రపంచమంతా గుసగుసరేపుతూ
జంటలు జంటలు జంటలు జంటలు
జంటలు జంటలు
జన జన జన జన జంటలు జంటలు
(ఈ పై లైనులో ఏవో బూతులున్నాయ్, బాగోదని అవి తీసేసి నేను వేరేది మార్చడం జరిగింది)
చిలిపినవ్వుల ఉల్లాసముతో
హంగురంగూ అర్బాటంతో
ఒకమారిచటా ఒకమారచటా
జంటలు జంటలు జంటలు జంటలు
జంటలు జంటలు
దేవుని గుడిలో, బడిలో మడిలో
ప్రాణముమసలే ప్రతీ స్ధలములో
ఉత్తరమందూ, దక్షిణమందూ
జంటలు జంటలు జంటలు జంటలు
జంటలు జంటలు
వెన్నెలలోనూ చీకటిలోనూ
మండుటెండలో జడిలో, చలిలో
కేండిల్ లైట్ల డిన్నర్ తోనూ
జంటలు జంటలు జంటలు జంటలు
జంటలు జంటలు
------------------------------------------
హా ఇదంతా చదివాకా గుర్తొచ్చింది, ఇది శ్రీశ్రీ మహాప్రస్ధానం – గంటలు ఆధారంగావ్రాసినట్లుంది.
(అది చదవనివారు ఈ క్రింది లింకు చూడగలరు)
శ్రీశ్రీ మహాప్రస్ధానం – గంటలు
పాపం చాలా రగిలిపోయి వ్రాసుంటాడు నిజమే..!!!, ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ బహిరంగ ప్రేమలూ.. ప్రదర్శనలు ఎక్కువైపోయాయిలేండి.., ఎంతైనా మనసుపాడవుతుంది కదా..??
బాగానే వ్రాసాడు.
2 కామెంట్‌లు:
baagaa raasadu.roaddu paalayina kavitani saitam blaagupaalu ceasina meeku krutajanalu.
"..తడిసె రక్తమున కాకుంటే కన్నీళులతో" అన్న మహాకవి కవిత చదివినప్పుడు కూడా నాకూ ఇలాంతిదే ఒక బూతు గుర్తుకొస్తుంది. రక్తముతో, కన్నీళులతో తడవకపోయిన ప్రియుల XXXX తో తప్పక తడిసివుంటుందని...
--ప్రసాద్
http://blog.charasala.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి