18, అక్టోబర్ 2006, బుధవారం

పెళ్ళి గోల





పేరు శెఖర్ వ్వవసాయశాఖలో సీనియర్ ఇంజనీర్ , వయసు 30, మంచి జీతం, పెద్దగా బాధలు లేని జీవితం.
ఖాళీ దొరికినప్పుడల్లా పాపం తలపైన చెయ్యివేసి, పోయిన నాలుగెకరాల జుట్టుగురించి బాధ, ఇంకా పెళ్ళి కాలేదని.. అందరూ ఏడిపిస్తున్నారని బాధతప్ప.

**************
“అబ్బే అప్పుడే పెళ్ళేంటండీ మావాడికి. ఇంకా 21 వాడికి.. చదువు పూర్తికావాలి, సెటిల్ అవ్వాలి.. ఇంకొక రెండుమూడేళ్ళవరకూ ఆ ఆలోచనలేదండీ మాకు.”, అన్నఅమ్మ మాటలు చాటుగా వింటూ, అద్దంలో ఒకసారి మొహంచూసుకుని, మీసాలు దువ్వుకున్నాడు శేఖర్. ఓ మనకు సంభంధాలు రావడం మొదలుపెట్టాయి అని మనసులో తెగ మురిసిపోయాడు. శేఖర్ అప్పుడు ఇంజనీరీంగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు లోకల్ కాలేజీలో.

**************
“ఛా.. చెప్పేయాల్సిందిరా! శేఖర్ నువ్వంటే ఇష్టం అని.., పెళ్ళి చేసుకుంటా అని, అంతలా ఆ అమ్మాయి వచ్చి అడిగినా నువ్వు మాట్లాడవే?. , మీ ఇంట్లో ఎదిరించి పెళ్ళి చేసుకోవచ్చుగా. కొంతకాలం గడిస్తే మీ అమ్మా నాన్నా ,వాళ్ళే అన్నీ మర్చిపోతార్రా, ఖచ్చితంగా అంగీకరిస్తార్రా.. ఇలా ఎన్ని ప్రేమకధలు చూడలేదురా…”, ప్రేమించిన అమ్మాయికి పెళ్ళిసంభందాలు చూస్తున్నారని వచ్చి చెప్పినప్పుడు. శేఖర్ ఏమిమాట్లాడకుండా ఉన్నందుకు తన ఫ్రండ్ సుందర్..అన్న మాటలు

ఇంజనీరింగ్ అయ్యి సంవత్సరమైనా ఇంకా ఉద్యోగలేక, ప్రయత్నాల్లో ఉన్న శేఖర్ ఇంట్లో వాళ్ళను నొప్పించలేక, శేఖర్ మంచి బాలుడు అని ఊరిలో ఉన్న పేరు చెడగొట్టుకోలేక, ప్రేమించిన అమ్మాయి దగ్గర మౌనం వహించాడు. ఆ అమ్మాయికి తరువాత పెళ్ళైపోయింది.

**************
చదువు పూర్తియిన ఐదవ సంవత్సరానికి వచ్చింది ఉద్యోగం, జూనియర్ ఇంజనీరుగా, అందరూ "మనవాడు సాధించాడ్రా" అంటుంటే. శేఖర్ కి పట్టలేని ఆనందం. 'ఇంకేంటి ఇక పెళ్ళే. త్వరలో పిలుస్తాడు అందర్నీ", అని ఫ్రండ్సంతా అంటుంటే. అవును ఇప్పటికే బాగా ఆలస్యమైంది ఇక పెళ్ళిప్రయత్నాలు మొదలుపెట్టాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.

సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఇంట్లో వాళ్ళు పెళ్ళిమాట ఎత్తడంలేదు. ఇంట్లో డైరెక్టుగా అడగలేడు.. కారణం ఏంటని. ఒక స్నేహితుని ద్వారా తెలిసిందేంటంటే. వచ్చిన ప్రతిసంభందానికి ఏదో వంకలు పెట్టి పంపించేస్తున్నారని , ఎవరైనా అడుగుతుంటే.. అప్పుడే కంగారేముందివాడికి అన్న సమాధానమొస్తుందని తెలిసింది.

బయట జనాల గోల పడలేకపోతున్నాడు శేఖర్. సెలవుపై ఊరు వెళ్ళినపుడు ప్రతివాడు చేసిన వెటకారం తలచుకుంటే ఒళ్ళుమండింది. ఇక పెళ్ళయ్యేవరకూ మళ్ళీ రాకూడదు అని నిర్ణయించుకున్నాడు.

************
ఫ్రండ్స్ అంతా అంకుల్ అనడం మొదలుపెట్టారు.. "బాబాయ్ అని పిలవండ్రా", అని చిరాకు పడ్డాడు వాళ్ళపై శేఖర్. "మరి ఇరవైతొమ్మిది వచ్చాయ్ ఏమనాలమ్మా అంత చిరాకు పడుతున్నావ్", అని వెటకారంచేసారు.. 'ఒరే మీ ఏజ్ కూడా అంతేరా.. కానీ మీలో ఎవడూ నిజం డేటాఫ్ బర్త్ చెప్పడు.. నేనే చెప్పుకున్న వెధవని ",అని కవర్ చేసుకున్నాడు.

ఈ మధ్య ఒక కొత్త విషయం ఒకటి కనిపెట్టాడు శేఖర్.. ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా పెళ్ళికి సంభందించిన పాటలు పెట్టడం మొదలుపెట్టాడు.

“ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి..”

“శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం.. ఇక ఆకారం….”, ఈ పాటలు గమనించిన శేఖర్ వాళ్ళమ్మ.. "అదేంటిరా కొత్తపాటలు వినక అవేంపాటలురా..", అంటే.. "అవా.. ఇక్కడ లోకల్ రేడియోలో అమ్మా", అని మాటదాటేసాడు.., "మరి ఎప్పుడూ అవే వరసలో వినిపిస్తున్నాయి.. దీనితరువాత.", “ఏడడుగుల సంభంధం.. ఏనాడో వేసిన భందం” ఆ పాట వస్తుంది కదా??, అని అనేసరికి శేఖర్ నాలుక్కరుచుకుని "నేను తరువాత మాట్లాడతా.." అని పెట్టేసాడు ఫోను.

"ఛీ.. ఈ పాట తరువాత ఏ పాటో తెలుసు కానీ, ఈ పాటలు ఎందుకు పెడుతున్నాడో కొడుకు అని అర్ధంకాదా… వీళ్ళకి..", అని ఒక్కసారి తలగోడకేసి కొట్టుకున్నాడు..

"ఉద్యోగం ఎలా ఉందిరా", అని వాళ్ళ నాన్న అన్నప్పుడు, 'ఉద్యోంగ పర్లేదు నాన్నా వంట అది చేసుకోలేక చేతులు కాల్చుకుంటున్నా. బయట హోటల్ భొజనం తినలేక ఆరోగ్యం పాడవుతుంది", అని చెప్పడం మొదలు పెట్టాడు.

"ఐతే వంటమనిషిని ఒకడిని కుదర్చనా పోనీ.. మన ప్రసిడెంటు గారి అబ్బాయిక్కూడా మొన్నే ఒకతన్ని వంటకు కుదిర్చా..", అని సలహా ఇచ్చిన నాన్నని ఏమనాలో అర్ధం కాక.. ఫోను "హలో!. హలో!!.. వినపడడం లేదు", అని కట్ చేసేసాడు.

"ఛీ.. ఇంక సిగ్గు విడిచి పెళ్ళివిషయం అడిగినందుకు నాకు సిగ్గుండాలి.. ఇక ఈ విషయం వీళ్ళముందెత్తను.. నాకు బుద్దొచ్చింది..", అని ఒక వారంరోజులు ఫోను చేయడం మానేసాడు ఇంటికి.

************

కాలం గడిచింది…ఆధ్యాత్త్మికం అబ్బింది శేఖర్ కి.. బ్రహ్మచర్యమే బెస్ట్ అని నిర్ణయించుకుని. దానికి సంభందించిన పుస్తకాలు చదవడం, సత్సంగాలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. సంసారం సాగరం.. అది అంటని మనిషి మహామనిషి అవుతాడు అని అందరికి చెప్పడం, పెళ్ళైన తరువాత ఫ్రీడం ఉండదు అని చెప్పే వాళ్ళతో కలిసి సై అంటే సై అని లెక్చర్లు కొట్టడం, కనపడ్డ ఫ్రండ్స్ కి క్లాసులు పీకడంతో ఎవడూ దగ్గరకు రావడానికి.., పెళ్ళిగురించి ఎత్తడానికి సాహసించడంలేదు.

అదే సమయంలో ఇంట్లో వాళ్ళు ఏవో సంభందాలు వచ్చాయి.. చూడడానికి రమ్మని పిలుపు.

నేను రానంటే రాను.. పెళ్ళే చేసుకోనని మొండి పట్టు.. , మావయ్వ నుండి, అన్నయ్యలనుండి బ్రతిమలాట కాల్స్ లా ఫోన్స్ రావడం మొదలయ్యాయి. గోల భరించలేక పోను కట్ చేసేసాడు.

************

ఎలాగైతే బలవంతంగా ఒప్పించారు పెళ్ళికి ఇంట్లోవాళ్ళు.. వచ్చినవాటిలో ఒకమ్మాయి ఒకే చేసాడు..
పెద్దాళ్ళంతా పెళ్ళి హడావుడిలో పడ్డారు.

ఇప్పుడు శేఖర్ కి వచ్చిన పెద్ద చిక్కల్లా ఇక్కడే ఉంది..ఆధ్యాత్త్మికం క్లాసులు పీకినవాళ్ళను పెళ్ళికెలా పిలవాలా అని…

13 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హా హా! బలే ముక్తాయింపు.

అజ్ఞాత చెప్పారు...

ఈ కధా కధనం బాగుంది. ఇలాంటివే మరించి కథలు అందించాలని ఆశిస్తూ

రాధిక చెప్పారు...

paapam sekhar.mee saili baagundi.

spandana చెప్పారు...

శ్రీ,
కథ చాలా బాగుంది.
--ప్రసాద్
http://charasala.com/blog/

రానారె చెప్పారు...

చాలా చాలా చాలా బాగా రాశారీ కథ రాజుగారూ, మంచి ముగింపు కూడా.

అజ్ఞాత చెప్పారు...

"చాలా బావుంది" అని చెప్పి ఊరుకోలేనంత బాగా వ్రాసారు. కానీ ఎమీ చేస్తాము..సమయా భావం చేత ఇంతే వ్రాయగలను. ఏదైనా పత్రికకు పంపండి, తప్పకుండా అచ్చౌతుంది.

అనంట్టు మీ బ్లాగుకు RSS link ఇవ్వగలరా?

- నవీన్
http://gsnaveen.wordpress.com

శ్రీనివాసరాజు చెప్పారు...

Thank. you..

this is my rss feed

http://nivasindukuri.blogspot.com/atom.xml

Usha చెప్పారు...

namaste andi naa peru USHA nenu ee kavithalokaniki kotta aamanini naaku sarigga raadu
kani edo tapana nannu ee vayasulo usikolputundi raayamani anduke mee andari daggaraki vochi vaalutunnanu nannu aadarinchamani korukuntunnanu

Usha చెప్పారు...

raadhika gaaru mee kavithalanni simply superb coments post cheddam ante endukoo nenu nachaledemo accept cheyyatledu email adress adugutundi mee mail ID ekkada kanapadaledu so anduke ikkada rastunna dayachesi reply ivvagalaru .
thanq

కౌటిల్య చెప్పారు...

నాకు డౌటే! ఇది మీ కథే కదూ.....;-)

శ్రీనివాసరాజు చెప్పారు...

కౌటిల్యా గారు,
ఇది ఎప్పుడో నాకు నాలుగెకరాలు నెత్తిమీదున్నప్పటి పోస్టు.., ఇప్పుడు ఇది నా కధ అని చెప్పుకున్నా అభ్యంతరం లేదులేండి. కానీ మీలాంటి వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది.. ట్రైచెయ్యండి :)

రసజ్ఞ చెప్పారు...

హహః బాగుందండీ భలే సరదాగా, చక్కగా ఉంది! అంత ఇబ్బంది పడే బదులు LBW సినిమాలోలాగా అమ్మా నాకింకా పెళ్లి చేయరా అని అడిగేయడమే!

శ్రీనివాసరాజు చెప్పారు...

@రసజ్ఞ గారూ
ఆ సినిమా ఈ మధ్య వచ్చిందేమోనండీ.. ఈ టపా రాసి ఇప్పటికే ఐదేళ్ళయ్యింది.. :-)

Related Posts Plugin for WordPress, Blogger...