దయచేసి మన (తెలుగు) పరువు తీయకండి…
------------------------------------------------------------------
పద్దతులు పద్దతులు బాబు… పాటించాలి… తప్పదు.. అందులోనూ మనం చదువుకున్నవాళ్ళం.
ఈమాత్రం ఓర్పు నహనం లేకపోతే ఎలా?? మన రాజధని నగరంలో ఎలాగూ పాటించలేం…ఇంతకీ ఏంటంటారా..? అదే చెప్తా..
ముంబయి మహానగరంలో.. అన్నిటికి పద్దతులే… బస్సుఎక్కేటప్పుడు వరుసక్రమం… తప్పారో,
డైవరుతో సహా ఎవరూ వదలరు మిమ్మల్ని తిట్టకుండా…
బస్సులో 50 మంది పడితే..అంతే… ఇంక ఎక్కనివ్వరు… తరువాతబస్సు ఎక్కవలసిందే..!!!
అబ్బే!!! మనమెక్కడ పాటించగలం నిలబడగానే చేతులకి పనిచెప్తాం…
చెమటలు తుడుచుకోవడానికో..లేక, ఎదుటివాడిని
తొయ్యడానికో…
ఇక పది నిముషాలైతే…నోటికి పని.. తిట్లు.. వినలేకచావాలి.. పక్కవాళ్ళు..
అవును తిట్లు గురించి చెప్పాలి… ఇక్కడ…
డ్రైవర్ ని..కండక్టర్ ని..హోటల్ లో సర్వర్ ని.., ఆటోవాడిని.., రోడ్డుపై
నడిచేవాడిని.. అందరినీ తిట్టే..హక్కంది.. (తెలుగులో) ఇక్కడ..
అది మన తెలుగోడి పవరు..
ఇంకొకటి…చోద్యంలా అనిపంచవచ్చు… ఆటోకోసంకూడా.. వరుసక్రమమండోయ్… బాగుంది…కదా..
చక్కగా ఇలాఉంటే.. అందరికీ సీటు దొరుకుతుంది… పనులుకూడా సక్రమంగా జరుగుతాయి..
ఎవడైనా ఈ లైన్లు దగ్గర గొడవపెట్టుకున్నాడంటే… కచ్చితంగా.. తెలుగోడో.. తమిళోడో.. నో.. డవుట్..
బస్సులో వెనుకనుండి. ఎక్కడం ముందునుండి దిగడం.. రన్నింగ్ , జంపింగ్,హేంగింగ్.. బస్సులు లేవు… త్వరలో రాబోతున్నాయి..
కండక్టరుతో గొడవపెట్టుకుని మరీ.. మనవాళ్ళు కొత్తగా అలవాటు చేస్తున్నారులేండి..
ఈ మధ్య పాలిథీన్ కవర్లు నిషేధించడం జరిగింది… ఇక్కడివాళ్ళు చక్కగా పాటిస్తున్నారు.
ఎంత క్లాసుగా ఉన్నా.. పేపరులో
చుట్టుకునిమరీ తీసుకెళ్తున్నారు…
కావలసిన వస్తువు చేతితో తీసుకెళ్ళడానికి సిగ్గేంటండీ..??, వాడెవడో గంట దెబ్బలాడాడు..,
సరుకుకొంటే కవరు ఎందుకివ్వవని…
తీరాచూస్తే అతనూ తెలుగోడే.., ఆఖరికి సరుకుకొనలేదనుకోండి అది వేరే విషయం. పాపం
ప్లాస్టిక్ ఎందుకు నిషేధమొ తెలియకో లేక హిందీ అర్ధంకాకో…మరి.
ఇంక ఆఫీసులో ఎవడిస్టంవాడిది… అమ్మాయిలపై పచ్చి కామెంట్లు.
అబ్బాయిలు అమ్మాయిలూ పచ్చిబూతులు గట్టిగా
మాట్లాడుతుంటారు.. ఫోనులో.. ఎవడికీ తెలుగర్ధం కాదని ధైర్యం.
మీరు చెబితే నమ్మరు.. ఒక తెలుగువాడు సైలెంటుగా ఉన్నాడంటే… పక్కన ఎవడో పరిచయంలేని తెలుగోడు ఉన్నట్లు లెక్క.
ఒక విషయం చెప్పడం మరిచా… అచ్చతెలుగులో మట్లాడటం చాలా కష్టమండోయ్. మనం మాట్లాడే పదాల్లో నలబైశాతం ఆంగ్లపదాలే…!!
అవి రాకుండా, పక్కవాడికి అర్ధంకాకుండా.. మేనేజ్ చేయడం చాలా కష్టం సుమండీ…!!!, అది ఒక కళ కూడానూ..!! కొన్నిటికి
తెలుగుపదాలేలేవు మన వాడుకభాషలో..
ఈ పాపం ఎవరిది చెప్పండి. ఆ విషయానికే వద్దాం.
మొన్న మన ఆంధ్రరాజధాని నగరం వచ్చా…
తెలుగు దేశంలో ,తెలుగు రాష్ట్రంలో,తెలుగు నగరంలో, తెలుగు రాజధానిలో…తెలుగేలేదు..!!!
భలే విచిత్రం అంతా పోష్ ఇంగ్లీష్..
ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా..
ఎంత అవమానకరం, ఎంత విచారకరం, మన మాతృభాషలో మాట్లాడటం.. నాకే సిగ్గేసింది..!!!
ఎక్కడ తెలుగు పేపర్ చదివితే తెలుగువాళ్ళమని తెలిసిపోతుందో అని, రాని ఇంగ్లీషు పేపరులో తలపెట్టి దాక్కుంటూ దొంగ చూపులు
చూసేవాళ్ళని ఎంతమందిని చూసానో..!!!
కానీ గవర్నమెంటు.. కొంత తెలుగును ప్రోత్సహిస్తున్నందుకు సంతోషపడ్డానండోయ్..
ఒక RTC బస్సులో చదివా…”ఈ బుస్సు
మనిందిరిదీ దీనిని పరింశుభ్రముగా ఉంచుందాం”,
ఏదో విషయం అర్ధంమయ్యిందిలేండి… అదేకదా భాష
ముఖ్యోద్దేశ్యం.
పాపం..!! ఈ అచ్చుతప్పుల్లో గవర్నమెంటును ఎలాతప్పుపట్టగలం చెప్పండి..
నాకు ఒక భయం పట్టుకుంది… మన తరంతోనే తెలుగుకి అంతం అని..
రేపు మా అబ్బాయొ, అమ్మాయొ.. “డాడీ.. వాటీజ్ టెల్గు… అంటే.. ఐ డోంట్ నో సన్” అనాలేమో అని…
ఇంకా భాషమీద అభిమానం పోకపోతే.. పిల్లలకి ట్యూషన్ చెప్పించైనా.. తెలుగు నేర్పిస్తామేమో… దానికన్నా అవమానం ఇంకేదీ
ఉండదేమో…???
-------------------------------------------------------------------
ఇందులోని పాత్రలూ నన్నివేశాలు…అందరినీ (నాతో కలుపుకుని) ఉద్దేశించి రాసినవే…
సాటి తెలుగువాడినై తెలుగువాళ్ళగురించి ఇలా రాయడం తప్పేనేమో…కూడా..
మన చెత్త, మన చెత్త అని ఇంట్లో పెట్టుకంటే… ఆ చేత్తతోపాటు మనం కూడా… కుళ్ళిపోవలసివస్తుంది.
పరాయి భాషలాగా, మాతృభాష బ్రతుకు తెరువుని చూపించలేక పోవచ్చుకాని… మాట్లాడటానికి… కూడా… అర్హతలేనిది కాదే..??
ఏ భాష నేర్చుకున్నా ,అన్ని భావాల్ని పలికించగలిగేది…మాతృభాషద్వారానే కదా..?,
ఏరుదాటినాకా తెప్పతగులపెట్టే చందాన, మరి అంత చులకన అవసరంలేదేమో అని నా ఉద్దేశ్యం..
ఇది రాస్తూ కూడా…ఎన్నో ఇంగ్లీషు పదాలు తెలుగులో తర్జుమా చేయవలసి వచ్చింది…
ఈ పాపం ఎవరిదంటారు..???
12 కామెంట్లు:
మరో మంచి వ్యాసం .... శ్రినివాస్ గారు...
ఈ దుర్గతి కేవలం తెలుగు కే ఇతర ప్రాం తీయ భాషలు బేషుగ్గా ఉన్నయి ...
కాక పొతే తెలుగు అంత త్వరగ అంతరించదు లెండి .....
అసలు స్కూల్ లో నే తెలుగు తప్పనిసరి చేస్తే , తెలుగు కి సగం
కష్టాలు తప్పినట్టే ...
.....
ఈ మాత్రం తెలుగు టైప్ చెయ్య డానికి
నాకు అర్ధ గంట పట్టింది పదాలు వెత్తుకొవడానికి .....
స్వపక్షంలో విపక్షం ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోడంలోనే ఉంది సంస్కారం! నిప్పుల్లో కాగాలి, సమ్మెట దెబ్బలు పడాలి, అప్పుడే కదా.. ఇనుప ముక్క కొడవలైనా, గొడ్డలైనా అయ్యేది!!
మన భాషంటే మనకు ప్రేమ తక్కువే. పెరటి చెట్టు లాగా మనకది చులకన, అంతే! అదే దొరకని రోజున మొహం వాచిపోతాం. కానీ తెలుగును భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వమూ, టీవీల ముందు ఇదెంత!? వీళ్ళు చేస్తున్నది అన్యాయము, ద్రోహమూ. మనది కేవలం నిరాసక్తతే!
మీ వంటి వారి ఆవేదన చినుకై, వానై, వరదై ఈ ప్రభుత్వాల, మాధ్యమాల తెలివిమాలిన తనం కొట్టుకు పోవాలని ఆశిద్దాం. పెరుగుట విరుగుట కొరకే అన్నారు కదా! ఉందిలే మంచికాలం ముందు ముందునా..
మీరు చాలా ఖచ్చితంగా చెప్పారండి. నేను ముంబై నగరం లో వున్న 2 సంవత్సరాలు ఆ నగర ప్రజల జీవన విధానాన్ని చూసి ఎంత సంతోషపడ్డానో చెప్పలేను. దాదాపు 2 కోట్ల జనాభా, కాని ఎంత లయబధ్ధం ? చూస్తే ముచ్చెటేసింది. మన 'హై'నగరం లో అన్నీ 'హై' గానే వుంటాయి. ప్రజల జీవనవిధానం అతి చెత్తగా తయరవుతుంది ఇక్కడ. అందరిలో వ్యక్తిత్వ వికాసం వచ్చిన రోజు ఈ ప్రభుత్వాలూ చక్కబడతాయి, మన తెలుగు భాషా రాజ్యమేలుతుంది.
'హై' నగరం వీటిలో ప్రధమ స్థానం లో వుంది.
01. అపరిశుభ్రమైన రోడ్లు, మురుగు నీటి కాలువలు
02. 17 సంవత్సారాలా లోపే సెక్స్ లో పాల్గున్న వారి సంఖ్య
03. రోడ్డు ప్రమాదాలు
04. ఎయిడ్స్ రోగులు, ప్రమాదకరమైన ప్రభుత్వ ఆసుపత్రులు , జైల్లు `
ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడక పోతె బట్లర్ ఇంగ్లీష్ అనడం పరిపాటి. కాని చిత్రంగా ఇటీవల కాలంలొ రెస్టారెంట్ కల్చర్ అలవాటైన మన తెలుగు వాల్లు తమకి కావల్సిన పదార్దాలు తెమ్మని చెప్పడానికి వచ్చి రాని ఇంగ్లీష్ లో ఆర్డర్ ఇస్తారు. బట్లర్ ల దగ్గర బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లడకపోతె వచ్చె నస్టం ఏంటొ??షాపర్స్ స్టాప్,సెంట్రల్ వంటి షాప్ల లొ తెలుగులొ మాట్లడితె ఎక్కడ తక్కువ అయిపోతామా అని కేవలం ఇంగ్లీష్ లోనె మాట్లాడుతూ హైటెక్ రేట్లకి బట్టలు గట్రా కొనుక్కుని వస్తు ఉంటారు.
అక్కడ పని చేసె వాల్లు తెలుగు వాల్లు.మన తెలుగు రాస్ట్రం లో ఉన్న షాప్ లొ కూడ డిమాండింగ్ గా తెలుగులొ కావల్సింది అడగలేని అనవసరపు నామోషిని మనమె తెచ్చి పెట్టుకుంటున్నాం.
Naa Abhiprayanni Telugu lo ela vrayalo teliyaka... Anglam lone vrasthunna.
Meeru cheppina sandarbhalu nooriki noorupallu nijam.
Nenu kooda alanti chala sandarbhalu edurkonnanu.
Okasari iddari mukhakavalikalu okelaga unnayi ani annanu... anthe, eduti vyakti bhalluna navvaru. Edo vishayam matladuthu adi pukaru ani cheppadaniki, adigo puli ante idigo toka antaru kada janalu annanu... anthe, akkada nenoka vintha manishinayipoya.
Mana Telugu vallayithe mareenu (nenu kooda telugu vaadine.. kaani matru bhasha vaduka vishayam lo nannu chala bhadinchedi mana valle), anavasaramaina bheshajala vishayam lo eppudu mana vallu munduntaru.
Telugu lo matladadam, telugu lo vrayadam chala namoshee anukuntaru. Meeru anukunnattu, naaku kooda chala paryayalu anipinchedi, Telugu bhasha abhimanam mana taram tone agipothundemonani...
pavan
you can use http://veeven.org/lekhini
Sri,
good one. Nice write up.
మంచి వ్యాసం.
మీ హృదయ ఘోష చక్కగా వివరించారు.
మంచి విశ్లేషణ. అందరూ అలోచించవలసిన విషయం.
chAlA manchi vyAsam srinivas gaaru.
meeru cheppinaTTu, inkaa ikkaDa chAlAmandi cheppinaTTu... teluguvaaLLu maatramE telugu maatlaaDatTaaniki chAlA mohamATa paDutunTaaru.
nEnu pani chEsE office lO, chAlA mandi tamiLulu, maLayAlIlu unTaaru... kAni unna koddi mandi telugu vaaLLalO telugu maatlADaTaaniki ishTapaDevaaLLu chAlA mandi unnaaru. kontamandiki adi bhaasha meeda unna abhimaanam aite, kontamandiki aa vErE bhaashavaaLLani dominate chEyAlanE uddhESam.
mana bhaasha meeda abhimaanam unDachu, kaani adi paraayi bhaashalani kinchaparache laaga unDakuDadani naa uddhESam.
Super color scheme, I like it! Keep up the good work. Thanks for sharing this wonderful site with us.
»
chala manchi vyaasamu.
అవును, ముంబయిలో మంచి క్రమశిక్షనగా ఉంటారు. ఒకసారి నేను అర్ధరాత్రి ఇంటికి ఆటోలో వస్తే నాకు చిల్లర కచ్చితంగా ఇచ్చాడు extra అడక్కుండా!
ఇక తెలుగులో మట్లాడ్డానికి వస్తే మన చదువరి గారు అన్నట్టు మన అవేదన గాలివాన లాగా మారాలి. మన భాష మీద ప్రేమ వర్షం ఇలాగే కురిపిద్దాం!
కామెంట్‌ను పోస్ట్ చేయండి