19, జూన్ 2006, సోమవారం

నా డైరీలో ఒక పేజీ...







ఎందుకో!! ఒక ప్రశ్న మనసులో వచ్చింది?,


నేను బ్రతకవలసిన విధంగానే బ్రతుకుతున్నానా? అని.
భారతీయుడినని…హిందువునని…చదువుకున్నవాడినని…సంస్కారముందని గర్వపడ్డానుకానీ!!...

మనిషి ఈలోకానికి రావడానికి కారణం “కర్తవ్యం నిర్వహిండడానికి”, అని అంటారు..? ఆ కర్తవ్యం నేను చేసానా?, ఇంకా చెయ్యాలా?? లేక ఎవరైనావచ్చి చెబుతారా చెయ్యమని?...


ఊహు!!.. సమాధానం దొరకలేదు…మళ్ళీ ఆలొచించాను…!!!


ఎవరినైనా అడుగుదామంటే, “వేదాంతం” అని ఎగతాళి చేస్తారని భయం వేసింది.

25-30 ఏళ్ళు వచ్చేవరకూ లోకమే తెలియదు…చదువుకే అంకితం…

తరువాత ఉద్యగం, ఆ తరువాత పెళ్ళి, భార్య,పిల్లలు.. తల్లిదండ్రుల బాగు…

అమ్మో!!!... ఇంకా ఎన్నో బాద్యతలు..


మరి నాకు సమయం ఎక్కడ దొరుకుతుంది.. కర్తవ్యం సాదిండానికి…

నా పిల్లలు, నా వాళ్ళు…నాజీవితం, నా కుటుంబం… నా…నా… ఏమిటి. ఈ “నా”?.. ఇదే’నా’ కర్తవ్యం లేకపోతే??...

‘నా’ కోసమేనా!!!


ఒక్కరే నా ప్రశ్నకు నమాధానం ఇవ్వగలరు అనిపించింది… ఆ భగవంతుడు!


అడిగాను, సూటిగా కాక పోయినా, అదే అర్దం వచ్చేలా…
”మనిషికి జంతువుకి తేడా ఏంటని?...”


"జంతువులు తమ బ్రతుకు బ్రతుకుతాయి, మనిషి అందరి మేలు కోరి బ్రతకాలని…,బ్రతుకునివ్వాలని” నమాధానం వచ్చింది.


మరి నేను అలా బ్రతుకుతున్నానా?... అని ఆలోచిస్తే నవ్వొచ్చింది కూడా?



ఒకరోజు నేను అలారోడ్డుపై వెళ్తున్నాను. దారిలో ఒక కుక్కకి దెబ్బతగిలి పడుంది.

నాకు పెంపుడు జంతువులు అంటే ఇష్టమే!.. అది చాలా బాధతో అరుస్తుంది.
నాకు జాలికలిగింది. అందరూ చూస్తున్నారు, కొందరు జాలి పడుతున్నారు. కాని ఎవరూ పట్టించుకోవడంలేదు!.


హాస్పిటల్ కి తిసుకెళదామని అనిపించింది.. అడుగు ముందుకు వేసాను.

ఎవరైనా, ఎమైనా అనుకుంటారెమోనని అనిపించింది…

నా బిజి లైఫ్ గుర్తుకు వచ్చింది…

నా నమయం వృధా చేసుకుంటున్నానేమొ అని అనిపించింది.

అడుగు వెనక్కి పడింది….



తరువాత ఏం జరిగిందో తెలియది?? …నేను దాటి వెళ్ళిపోయాను.




కాని రొండురోజులు మనసులో ఏదో వెలితి, తప్పుచేసానన్న భావన… చాలా డల్ గా అయిపోయా!!.

చాలా బాధ కలిగింది… ఇప్పుడు బాధపడడమేనా నేను చేయగలిగేది?.

అదే మనిషికి జరిగిఉంటే చేసేవాడినా??, …ఏమో తెలియదు?.


అక్కడే, అప్పుడే వస్తున్న పాట నన్ను ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది….!!!



"కరుణను మరపించేదా.. చదువూ సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా..? సాంప్రదాయమంటే… చుట్టూ పక్కల చూడరా.. చిన్నవాడా.."

(రుద్రవీణ సినిమాలోనిది.)



దేవుడినే అడిగా…”ఏమిటి స్వామీ!!, నేను నిజంగా సాయపడలేనా.." అని.


“ఈ జగమంతా, నీ కుటుంబమే అనుకో, సాయపడగలవు”, అని సమాధానం వచ్చింది.


అమ్మో!!!... ఈ జగమంతా నా కుటుంబమా?, కష్టం కదా?, నా కుటుంబం పోషించే స్థానానికి చేరే సరికి ఈ 25-30 ఏళ్ళు అయిపోయాయ్!

మరి ఈ జగమంతా?, అంత డబ్బు నేను సంపాదించగలనా?,

సంపాదించినా!, మనసు…, మనవాళ్ళు… అందరూ.. నాకు సాయపడాలి.. మరి ఎలా???



“సహాయం అంటే డబ్బే కదా!!”, అని చాలా పొరపాటు పడ్డా, తరువాత బాగా ఆలోచిస్తే తెలిసింది.

ఈ కుక్కకు దెబ్బ తగిలిన విషయంలో, నేను స్వయంగా వెళ్ళి సహాయపడకపోయినా,
ఒక ఫోను చేస్తే ఏ Blue Cross వాళ్ళో చేసుండే వాళ్ళు.


“సాయం అంటే, మాట కూడా అన్నమాట”.



*  “మనం చేసే ప్రతిపనిలోనూ.. న్యాయంగా ఉంటూ… ఏదైనా తెలియని వాళ్ళకు, విషయాన్ని తెలియచేస్తూ….”
ఉదాహరణకి..నేను ఉద్యోగం ప్రయత్నంలో పడ్డ కష్టాలు.. వేరొకరు ఉద్యోగ వేటలో..సమస్యకి పరిస్కారం కావచ్చు కదా!!.. ఇక్కడ నాకు ఏం పోతుంది… ఒక చిన్నమాట తప్ప.

*  “ప్రతిపనిలోనూ, ప్రతి మనిషిలోనూ…ఆ దేవుడున్నాడని నమ్మితే.. సాయపడడం కష్టంకాదు"


నెనొక్కడినే “జగమంత కుటుంబం నాది”, అని అనుకుంటే కష్టంకానీ!!

మనమంతా అలా అనుకుంటే కష్టమేమికాదు కదా!!!?.




6 కామెంట్‌లు:

చైతన్య చెప్పారు...

ee pEgI baagundanDi...
andarU alA AlOchinchi AcharinchagaligitE inkA baagunTundi.

Krishh Raem చెప్పారు...

gr8 post..... keep posting such ....

even iam rethinking about myself these days.....

spandana చెప్పారు...

భలే వుంది మీ చింతన. రాత్రి నాకు మా అన్నయ్య కు ముసలి వారికి సహాపదటం గురించి జరిగిన పోన్ సంబాషణ తర్వాత ఈ రోజు ఆ విషయం మీద బ్లాగు రాయాలని అలోచిస్తునే వచ్చాను. ఇప్పుడు మీ బ్లాగు చదివాక నాకు మరింత ప్రేరణ కలిగింది.
మన వేదాలూ, ఋషులూ ఎప్పట్నుంచో చెప్తున్నదీ అదే -- ఈ సర్వ జగత్తూ దేవుడే..అన్నిట తానై..అన్నింటినీ తనలో కలిగిన వాడు భగవంతుడొక్కడే. నేను ఒక వస్తువుగానో, ఒక సత్యముగానో, ఒక శక్తి గానో దేవున్ని నమ్మను. అలాగని నాస్తికుల్లా దేవుడు లేడనే వాదాన్నీ సమర్థించను. నా భాష్యంలో ఈ జగత్తులోని ప్రతిదీ ఏ అంతఃసూత్రముతో అయితే బందింపబడి ఉన్నదో దాన్ని దేవుడు అనుకుంటాను. పూజలు, భక్తి, పారాయణాలు, వేద పఠనాలు ఇవన్ని కూడా అంతిమంగా దేవున్ని అనగా జగత్తుని, అనగా ఈ జగత్తులోని ప్రాణికోటిని సేవించగలగటమే అయుండాలి. నాలో, నీలో, నా ఎదురుగా, నీ ఎదురుగా ప్రతి జీవిలో, ప్రతి కదలికలో, ప్రతి నిశ్చలములో దేవుడే ఉన్నప్పుడు, ఏ జీవినైనా సరే సేవించడములొనే, రంక్షించడములోనే దైవసేవ ఉంది.
మీరన్నట్లు మన అంతరాత్మ ఎంతగా ఘోషించినా మొహమాటం, అధైర్యం, చూసేవారు నన్ను చూసి ఏమనుకుంటారో అనే భావము మనల్ని మంచి పని చేయటనికి వెనక్కి లాగుతూ ఉంటుంది. మీలాగానే ఆలోచించేవారు ఆ పదిమందిలోనూ ఉంటారు. మీరు చేసే పనిని వాళ్ళూ తప్పకుండా మెచ్చుకుంటారు. అయితే మొదట తెగింపు అవసరం. ఒక్కసారి తెగించావా ఇక ఆ మొహమాటం అన్నీ పటపంచలు అయిపోతాయి.
మ్మ్... నా ఆలోచనా స్రవంతిని ఇక్కడితో ఆపి మిగతాది నా బ్లాగులో మిగతాది రాస్తాను.
-- ప్రసాద్

అజ్ఞాత చెప్పారు...

Very pretty design! Keep up the good work. Thanks.
»

రాధిక చెప్పారు...

eenno saarulu manchi cheyalani anukuni evaranna emanna anukuntaremo ani..navvutaremo ani bhayapadi cheyadam maanesina smadarbhalu chalane vunnay.kani taruvata eppudu nenu vaati gurinchi alochnchaledu.alochinchi vunte naa gamanam,gamyam vere vidham ga vumdevemo?aalochimpaceese rachana.very good one andi

Unknown చెప్పారు...

Very nice...

Related Posts Plugin for WordPress, Blogger...