మువ్వల సవ్వడి..
మువ్వల చాటున సవ్వడి...
సవ్వడిలోన సందడి...
ఆ సందడి రేపే అలజడి...
అలజడి అలలజడి..
ఈ సంద్రం ఒడ్డున నువ్వోక అలలాకదులుతుంటే..
నా ఊపిరిని ఆపి..
నా హ్రుదయం చేసే సవ్వడిని..
ఈ సంద్రపు ఘోషతో పోలికను గమనిస్తున్నాను..
--- శ్రీ
మువ్వల చాటున సవ్వడి...
సవ్వడిలోన సందడి...
ఆ సందడి రేపే అలజడి...
అలజడి అలలజడి..
ఈ సంద్రం ఒడ్డున నువ్వోక అలలాకదులుతుంటే..
నా ఊపిరిని ఆపి..
నా హ్రుదయం చేసే సవ్వడిని..
ఈ సంద్రపు ఘోషతో పోలికను గమనిస్తున్నాను..
--- శ్రీ
రచన :: శ్రీనివాసరాజు సమయం: 4:27 PM 0 ఆభిప్రాయాలు
చంద్రునిలో మచ్చను చూసాను..
అసహ్యించుకున్నాను...
చండ్రుడే మచ్చ అన్నాను.. మచ్చే చంద్రుడు అన్నాను..
మచ్చని విడిచి మిగతా భాగం చూసా..
అందంగానే ఉంది అనిపించింది..
అంతా కలిపి చూస్తే.. మచ్చ కూడా అందం.. అనితోచింది.
అలా చూస్తూ వుంటే.. అసలు మచ్చే లేదనిపిస్తుంది..
ఎంత అందంగా ఉంది..
ఈ మార్పు చంద్రునిలోనా.. నా కళ్ళలోనా?
-- శ్రీ
రచన :: శ్రీనివాసరాజు సమయం: 3:31 PM 4 ఆభిప్రాయాలు
కధలాగా నీ రూపం మిగిలినా..
కలలో రోజూ నిన్ను చూస్తూనే ఉన్నాను.
నీకు చెప్పాలనుకున్నప్పుడు మాటలు రాకపోయినా..
మదిలో ఉప్పొంగే భావాల్ని కవితలా వ్రాస్తూనే ఉన్నాను..
నన్ను విడిచి వెళ్ళావని బాధగా ఉన్నా..
నా ఊహల్లో.. ఇంకా దగ్గరయ్యావని మురిసిపొతున్నాను.
ఏమో! మరి ఏమైందో.. నేస్తం
నిన్న కలలో, మదిలో, ఊహల్లో ఎక్కడా నిన్ను కలవలేకపోయాను..
అందుకే ఇది చదువుతున్నాను.
-- శ్రీ
రచన :: శ్రీనివాసరాజు సమయం: 2:52 PM 1 ఆభిప్రాయాలు
ఏంటిది.? నేను నవ్వితే నవ్వుతుంది..
నా బాధను స్పష్టంగా చూపిస్తుంది..
నా లాగే.. నాపోలికనే కలిగి ఉంది..
ఇదివరలా లేదే ఇదీ.. అంతా వ్యతిరేకంగా ఉండేది..
ఓ నేను చూసేది అద్దంలోనా..? ఇది అద్దమా.. అర్దంకావడంలేదు!!
లేదు..!!
ఆలోచనలు కనిపిస్తున్నాయి.. మాటలు వినిపిస్తున్నాయి
ఆ..!! ఇప్పుడు అర్దమైంది.. ఇది నా మనస్సు అని.
--- శ్రీ
రచన :: శ్రీనివాసరాజు సమయం: 1:42 PM 2 ఆభిప్రాయాలు